Saturday, November 15, 2025
Homeవైరల్Shocking Video: జలపాతం దగ్గర లవ్ ప్రపోజ్.. ఆనందపడే లోపే అనుహ్య సంఘటన..

Shocking Video: జలపాతం దగ్గర లవ్ ప్రపోజ్.. ఆనందపడే లోపే అనుహ్య సంఘటన..

Man Proposing his Girlfriend near waterfall: వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుంటాయి. దీని కారణంగా జలపాతాలు, డ్యామ్స్ ల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో వాటిని చూసేందుకు ప్రజలు ఇష్టపడతారు. వానా కాలంలో వాటర్ ఫాల్స్ భారీ ప్రవాహంతో పరవళ్లు తొక్కుతూ కిందకు జాలువారుతూ ఉంటాయి. ఈ దృశ్యం చూడటానికి పర్యాటకులు అక్కడకి వెళుతుంటారు. రిస్క్ చేసి మరీ ఫోటోలు దిగడం, స్నానాలు చేయడం చేస్తారు. వాళ్లు ఏ మాత్రం అదుపు తప్పిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలా ప్రాణాలు పొగొట్టుకున్న ఘటనలు మనకు చాలానే కనిపిస్తాయి. ఇవన్నీ చూసినా సరే యూత్ మారడం లేదు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. ఇద్దరు యువతీ,యువకులు జలపాతాన్ని చూసేందుకు వెళ్తారు. అక్కడ వారు కొంతసేపు సేదతీరుతారు. ఈ క్రమంలో ఆ కుర్రాడు అమ్మాయి దగ్గరికి వెళ్లి లవ్ ప్రపోజ్ చేస్తాడు. అది విని ఆమె షాక్ అవుతుంది. దాని నుంచి ఆ యువతి తేరుకునే లోపే ఊహించని సంఘటన చోటుచేసుకుంది. లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత కాలు జారడంతో ఆ యువకుడు జలపాతంలోకి పడిపోతాడు. దీంతో అప్పటిదాకా ఆనందంతో ఉన్న జంట..కాపాడండి అంటూ ఒక్కసారిగా అరుపులు కేకలు పెడుతోంది. తర్వాత ఏం జరిగిందనేది వీడియోలో చూపించలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆజాగ్రత్తగా ఉండటం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by localboy Karthik 22 (@repurikarthik)

ప్రస్తుతం వానాకాలం నడుస్తోంది. ఈ సమయంలో నదులన్నీ ఉద్ధృతంగా ప్రవహిస్తాయి. అంతేకాకుండా కొండల్లోంచి వచ్చే జలపాతాల్లోనూ భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది. ఈ ప్రదేశాలు చూడటానికి బాగున్నా.. మన ప్రాణాలను సైతం రిస్క్ లో పడేస్తాయి. వీటి దగ్గరకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా సేప్టీ చూసుకోవాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉండరాదు లేదంటే మీ ప్రాణాలు పోతాయి. మీలో ఎవరైనా ఇలాంటి ప్రదేశాలకు తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లండి.

Also Read: Goats on Escalator – ఎస్కలేటర్ ఎక్కిన మేకలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad