Viral Video Today: ప్రమాదకరమైన నదిపై విద్యార్థులు ప్రాణాలు తెగించి మరీ చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్లే ఘటనలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సార్లు చూశాం. తాజాగా అలాంటి ఓ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉప్పొంగుతున్న నదిలో విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని.. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తుంది. వారు కొంచెం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలో నకడ్ పాడ గ్రామంలో విద్యార్థులు చదువుకోవడానికి పాఠశాల లేదు. దాంతో వారు ఆ ఊరికి రెండు కిలోమీటర్లు దూరంలో గర్‌గావ్ అనే గ్రామంలో ఉన్న ఆశ్రమ్ స్కూల్ కు చదువుకోవడానికి వెళతారు. నకడ్ పాడ గ్రామం నుంచి గర్ గావ్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే పక్కనే ఉన్న నది దాటుకుని వెళితే కేవలం రెండు కిలోమీటర్లే వెళ్లాల్సి ఉంటుంది.
महाराष्ट्र के पालघर की तस्वीर — विकास की असली परीक्षा!
तेज बारिश… न पुल, न रास्ता
और फिर भी —
नन्हें कदम जान हथेली पर रखकर स्कूल के लिए निकलते हैं।
बच्चे बहते हुए बांध के पानी को पार कर जाते हैं,
सिर्फ इसलिए कि पढ़ाई न छूटे… सपने न टूटे।📹 वीडियो हुआ वायरल — लेकिन सिस्टम अब… pic.twitter.com/nqgZdBMX9G
— Vikku Sachan (@vikkusachan) July 3, 2025
దాంతో నకడ్ పాడ గ్రామానికి చెందిన చాలా మంది విద్యార్థులు నదిని దాటే స్కూల్ కు వెళుతున్నారు. సాధారణ వేళల్లో ఆ మార్గం బాగానే ఉంటుంది. కానీ, వర్షాకాలంలో నీటి ప్రవాం పెరిగి ప్రమాదకరంగా మారుతుంది. అయినా సరే విద్యార్థులు ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఆ మార్గంలోని వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. ఏ మాత్రం అదుపుతప్పినా వారు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. విద్యార్థులు నది గుండా వెళ్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో విద్యార్థులు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని.. అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా నదిని దాటుతున్నారు.
ఇదీ కూడా చదవండి: Viral: ఇదెక్కడి వింత ఆచారం రా బాబు.. మెుసలిని పెళ్లాడిన మేయర్.. వీడియో వైరల్ – Telugu Prabha Telugu Daily
చదువు మనిషికి అవసరం. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే చదువే సాధనం. అలాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఈ పిల్లలు చేస్తున్న రిస్క్ ను అభినందించాల్సిందే. కానీ రోజూ అలా ప్రయాణం చేయడం వల్ల ఏదో ఒక రోజు జరగరానిదే జరిగిందంటే అందరూ బాధపడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్థానికులు లేదా అక్కడి ప్రభుత్వం ఆ నదిపై చిన్న వంతెన నిర్మిస్తే వారి ఫ్యూచర్ కు బాటలు వేసినవారు అవుతారు.