Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపు దగ్గర మందుబాబు ఏం చేశాడో తెలుసా?

Viral Video: అడిగిన బ్రాండ్ ఇవ్వలేదని వైన్ షాపు దగ్గర మందుబాబు ఏం చేశాడో తెలుసా?

Bhadradri Kothagudem Viral video: మందుబాబులు మద్యం మత్తులో ఏం చేస్తారో వారికి తెలీదు. మందు తాగితే వారికి ఎక్కడా లేని ధైర్యం వచ్చేస్తోంది. ఆ మైకంలో వారు ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తారు. తాజాగా అలాంటి ఓ మద్యం ప్రియుడు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని ఏకంగా పెట్రోల్ తో మందుషాపునే తగలబెట్టాలని చూశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అశ్వాపురం మండలం మెుండికుంటలో చోటుచేసుకుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే..
మొండికుంటకు చెందిన దుర్గారావు అనే వ్యక్తి ఎప్పటిలాగే మందు కొనుక్కోడానికి మద్యం షాపుకు వెళ్లాడు. అయితే తాను అడిగిన బ్రాండ్ దుకాణందారుడు లేదని చెప్పడంతో మందుబాబు ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో ఆగకుండా షాపు వాళ్లతో వాగ్వాదానికి దిగాడు. బెల్ట్ షాపుల్లోనే బ్రాండ్స్ దొరుకుతున్నాయని.. అలాంటి మీ షాపులో ఎందుకు లేదని దుకాణం నడిపే వ్యక్తిని ప్రశ్నించాడు.

అనంతరం తిరిగి ఇంటికి వెళ్లిన దుర్గారావు పుల్ గా తాగి పెట్రోల్ బాటిల్ పట్టుకుని మళ్లీ మందు షాపు వద్దకు వచ్చాడు. నేరుగా దుకాణంలోకి వెళ్లి నాకు నచ్చిన మందు ఇస్తారా లేదా పెట్రోల్ పోయాలా.. అంటూ షాపు నిర్వాహకులను బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన షాపు యజమాని తన సిబ్బందితో కలిసి అతని చితక్కొట్టారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అప్పగించారు.

దుర్గారావు చేసిన తతంగం మెుత్తాన్ని పోలీసులకు వివరించారు. మెుత్తం విన్న పోలీసులు ఏ చిన్న కేసు పెట్టి వదిలేస్తారనుకుంటే.. ఏకంగా అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా అతడిని రిమాండ్‌కు తరలించారు. తప్పతాగి దుర్గారావు చేసిన వీరంగానికి అశ్వాపురం పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టడంతో ఈ విషయం స్థానికంగా హాట్ టాఫిక్ గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad