Monday, June 23, 2025
Homeవైరల్Trending Video: వీరికి నిజంగా భూమి మీద నూకలున్నాయ్.. లేకపోతే గ్యాస్ సిలిండర్ పేలి కూడా..

Trending Video: వీరికి నిజంగా భూమి మీద నూకలున్నాయ్.. లేకపోతే గ్యాస్ సిలిండర్ పేలి కూడా..

LPG Gas Cylinder Leak Video viral: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో గ్యాస్ లీకై మంటలు చెలరేగినా ఇద్దరు బతికి బయటపడ్డారు. నిజంగా వీరు లేచిన వేళావిశేషం బాగుందనే చెప్పాలి. ఇంకా వీరికి భూమి మీద నూకలున్నాయి. అంత బ్లాస్ట్ జరిగినా కూడా బతకారంటే అదృష్టమే. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. ఇందులో మహిళ గ్యాస్ సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అవ్వడం అదుపు చేయలేక అలాగే వదిలేసి ఇంటి నుండి బయటకు వెళ్లిపోతుంది. ఆ సిలిండర్ లోనిమయంలో ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. సిలిండర్ పైపు నుండి గ్యాస్ విడుదలవుతూ ఇళ్లంతా అలుముకుంటుంది. తర్వాత సిలిండర్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా ఆగిపోతుంది. దీంతో అంతా బాగుందని ఓ మహిళ, పురుషుడు లోపలికి వస్తారు. వారు గ్యాస్ బండ దగ్గరకు వెళ్లి దానిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఒక్కసారిగా వంటింట్లో ఇంట్లో నుంచి మంటలు వచ్చి మెుత్తం ఇళ్లంతా బ్లాస్ట్ అయిపోతుంది. ఇంత పేలుడు సంభవించిన వారు ప్రాణాలతో బయటపడతారు. ఇదంతా సీసీటీవీలో రికార్డు అయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘ఇంటి తలుపులు, కిటికీలు తెరిచిఉండటం వల్ల చాలా గ్యాస్ బయటకుపోయి వీళ్లు ప్రాణాలతో బయటపడ్డారని, లేకపోతే అంతే..’ అని కామెంట్లు పెడుతున్నారు. ఈ సంఘటన బట్టి అర్థమైంది ఏంటంటే.. గ్యాస్ సిలిండర్ ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు పోవడంతోపాటు భారీగా ఆస్తినష్టం జరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News