Thursday, January 15, 2026
Homeవైరల్Swetha Nagu video: బొగ్గు గనుల్లో 15 అడుగుల అరుదైన శ్వేత నాగు.. అందరూ చూస్తుండగానే...

Swetha Nagu video: బొగ్గు గనుల్లో 15 అడుగుల అరుదైన శ్వేత నాగు.. అందరూ చూస్తుండగానే మాయం..!

White Snake viral video: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. వాటిలో పాములు, ఏనుగులు, పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలకే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ పాములు కనిపించినా ప్రజలు తమ ఫోన్‌లలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒక అరుదైన శ్వేతనాగుది వైరల్ అవుతోంది.

- Advertisement -

వీడియో ఓపెన్ చేస్తే.. తమిళనాడులోని నైవేలీ బొగ్గు గనుల్లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. నల్లటి బొగ్గు గనుల్లో తెల్లటి నాగుపాము పరుగులు తీస్తున్న దృశ్యం అందరినీ షాక్ కు గురిచేసింది. అక్కడ పనిచేస్తున్న కొంత మంది కార్మికులు శ్వేతనాగును చూసి తమ ఫోన్ లలో రికార్డు చేశారు. ఈ పాము దాదాపు 15 అడుగుల పొడవు ఉన్నట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. అది అక్కడకు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు.

నైవేలీ బొగ్గు గనులు ఉన్న ప్రాంతం చుట్టూ దట్టమైన అడవి ఉంది. అక్కడ నుంచే దారి తప్పి వైట్ స్నేక్ గనుల్లోకి వచ్చి ఉంటుందని అక్కడున్న కొంత మంది భావిస్తున్నారు. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్ తోపాటు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు అది చాలా ప్రమాదకరంగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

Also read: Viral Video- ముంబైని వరదల నుంచి కాపాడిన స్పైడర్‌ మ్యాన్‌.. వైరల్ అవుతున్న వీడియో..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. దీంతో అడవుల్లో ఉండాల్సిన పాములు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లోకి, ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్పాలు ఇళ్లల్లో ఎక్కడపడితే అక్కడ నక్కి మనిషి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది. పాములు కనబడితే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి. ఒక వేళ కాటు వేస్తే సొంత వైద్యం చేసుకోకుండా దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించండి.

Also Read: Variety love story -83 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమించిన 23 ఏళ్ల యువకుడు.. వీరు ఎలా కలిశారో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News