Saturday, November 15, 2025
Homeవైరల్Virat Kohli: ఒక చిన్న పోస్ట్‌.. 11 మిలియన్ల వ్యూస్‌.. అది అతడికే సాధ్యం.!

Virat Kohli: ఒక చిన్న పోస్ట్‌.. 11 మిలియన్ల వ్యూస్‌.. అది అతడికే సాధ్యం.!

Virat Kohli Insta Post: ‘విరాట్‌ కోహ్లీ’ ఈ పేరు వింటే చాలు.. క్రికెట్‌ మాత్రమే కాదు అటు సోషల్‌ మీడియాలో కూడా తనకున్న కోట్ల ఫాలోవర్స్‌ కళ్ల ముందు కదలాడుతుంది. గ్రౌండ్‌పై రికార్డు పరుగులు చేయడమే కాదు.. చిన్న పోస్ట్‌తో నెటిజన్లను ఇట్టే ఆకర్షిస్తాడు. తాజాగా కోహ్లీ పెట్టిన ఓ చిన్న పోస్ట్‌.. కోట్లలో లైక్స్‌ను సాధించింది. ఇంతకీ ఏంటా పోస్ట్‌.. 

- Advertisement -

టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన క్రికెట్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లీ.. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నాడు. కుటుంబంతో కలిసి లండన్‌లో ఉంటున్న విరాట్‌ త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ చేసిన ఓ చిన్న పోస్ట్‌ ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది. ఈ పోస్ట్‌కు 24 గంటలైనా గడవకముందే 11 మిలియన్లకు పైగా లైక్‌లు రాగా.. ఆ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది.

‘Been a minute’..

విరాట్ కోహ్లీ తన భార్య, అనుష్క శర్మతో ఉన్న ఒక ఫొటోను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. ఈ పోస్ట్‌కు కోహ్లీ పెట్టిన క్యాప్షన్ కేవలం మూడు పదాలు- “Been a minute” అంటే ‘‘చాలా కాలం తర్వాత..’’ అంటూ పోస్ట్ చేశాడు. ఈ చిన్న పోస్ట్, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. 

కోహ్లీ, అనుష్క శర్మలు ఒకరికొకరు దగ్గరగా నవ్వుతూ ఉన్న ఈ ఫొటో క్షణాల్లో వైరల్ అయింది. ఈ పోస్ట్‌కు బాలీవుడ్ ప్రముఖులు ఆలియా భట్, అతియా శెట్టి లైక్ కొట్టి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. కోహ్లీ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదని ఈ రికార్డు స్పష్టం చేస్తోంది. కాగా, కోహ్లీ చివరిసారిగా ఐపీఎల్‌లో కనిపించిన విషయం తెలిసిందే.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన జట్టు ఆర్సీబీకి తొలి విజయం అందించి అంతులేని సంతోషాన్ని అందించాడు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad