Relatives Drink Alcohol With Patient: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి.. తన బంధువులతో కలిసి ఆస్పత్రి బెడ్‌పైనే దర్జాగా మందు కొట్టిన సంఘటన చోటు చేసుకుంది. హెల్త్ కేర్ వర్కర్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా తమ పనిలో తాము ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్ జిల్లా ఆస్పత్రిలో దేవేందర్ వ్యక్తి అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నాడు. సర్జికల్ వార్డులో రోగిగా చేరాడు. ఇటీవల అతనిని చూసేందుకు ఇద్దరు బందువులు ఆస్పత్రికి వచ్చారు. అయితే వచ్చిన వారు ఊరికే ఉండకుండా మద్యం బాటిల్, గ్లాసులు, స్టఫ్ తీసుకుని వచ్చారు. దర్జాగా పేషెంట్ పక్కన కూర్చుని మూడు గ్లాసుల్లో మందు పోసి తాగడం మొదలు పెట్టారు. ఇది గమనించిన హెల్త్ కేర్ వర్కర్ గాయత్రి చౌదరి వారి వద్దకు వచ్చింది. ఆస్పత్రిలో ఇలా చేయడం సరికాదని వారించింది.
Also Read: https://teluguprabha.net/viral/woman-breaks-train-ac-coach-window-after-purse-theft/
అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి ఇలా మందుకొట్టడమేంటని రోగిపై హెల్త్ కేర్ వర్కర్ మండిపడింది. ఇలా చేయడానికి ఎంత ధైర్యమని బంధువులను ప్రశ్నించింది. అయినా వారు వినిపించుకోలేదు. ఆస్పత్రిలో నో ఆల్కహాల్ పాలసీని పట్టించుకోకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.
ఆస్పత్రిలో ఇలా మందు కొడుతూ ఇతర రోగులకు ఇబ్బంది కలిగించడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు.
📍Shameful Reality of Public Behaviour!
In #Ashoknagar District Hospital, two men arrived with liquor bottles , not to comfort the patient, but to drink alcohol sitting right beside his hospital bed.
When a nurse tried to stop them, they shamelessly ignored her and the whole… pic.twitter.com/N3PJ63gwfz— Indian Doctor🇮🇳 (@Indian__doctor) November 1, 2025


