Python Attack On Man viral video: ఇటీవల కాలంలో నెట్టింట ఎక్కడ చూసిన పాముల వీడియోలే కనిపిస్తున్నాయి. నాగుపాము, కొండచిలువ, అనకొండ లాంటి పాముల వీడియోలు చూసేందుకు నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారి ఆసక్తిని బట్టి క్రియేటర్స్ కూడా భారీ సంఖ్యలో ఆ పాములకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. అందులో కాస్త డిఫరెంట్ గా ఉన్న వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
కెవ్ పావ్ అనే వ్యక్తి పాములను పట్టడంలో సిద్దహస్తుడు. ఇతడు ఎక్కువగా కొండచిలువలను వేటాడుతాడు. ఇందులో భాగంగా అతడు ఓ భారీ కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో అది అతడిపై ఎటాక్ చేస్తోంది. దాని తోకతో కెవ్ ను చుట్టేస్తోంది. ఎంత విడిపించుకుందామనుకున్న అది అంతలా బిగుసుకుపోతుంది. అయితే కెవ్ మాత్రం భయపడకుండా నవ్వుతూ ఉంటాడు. చివరకు ఏదోలా దాని నుంచి బయటపడి..చివరకు దాన్ని పట్టుకుంటాడు. కొండచిలువను సరిగ్గా పట్టుకోకపోతే అది తన ముఖంపై దాడి చేసేదని అతడు చెప్పాడు. పైథాన్ తో వ్యవహారించేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 30 లక్షలకు పైగా వీక్షించగా.. 50వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన తర్వాత అలాంటి భయంకర పరిస్థితుల్లో ఎవరైనా ఎలా నవ్వగలరని నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అయితే కొండచిలువలు మనుషులను మింగడం అప్పుడు మనం వార్తల్లో చదువుతూ ఉంటాం. తాజా వీడియోలో కెవ్ కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అతడు పరిస్థితి కూడా అంతే.
Also Read: Giri Nagu Viral video – బాత్రూమ్‌లో తిష్ట వేసి కూర్చున్న 16 అడుగుల గిరి నాగు.. వీడియో వైరల్


