Kerala: ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే దాన్ని ఓ వృద్ధురాలు నిజం చేసింది. వయసు అనేది కేవలం సంఖ్య అని 72 ఏళ్ల మహిళ రుజు చేసింది. కేరళకు చెందిన 72 ఏళ్ల మహిళ మణి అమ్మ దుబాయ్ వీధుల్లో రోల్స్ రాయిస్ కారు నడుపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఈ వృద్ధ మహిళ చీర ధరించి ఉంది. పూర్తి నమ్మకంతో రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ కారును నడుపుతున్నట్లు కనిపిస్తుంది. కాగా.. ఈ వీడియోను చూసిన నెటిజన్లు మణి అమ్మ శైలిని, ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.
Read Also: IBPS Jobs: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా?
కేరళలో డ్రైవింగ్ స్కూల్
మణి అమ్మ ‘ది డ్రైవర్ అమ్మ’గా అందరికీ సుపరిచితమే. ఆమె కేరళలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతోంది. ఆమెకు 11 రకాల వాహనాలను నడపడానికి లైసెన్స్ ఉంది. ఆమె లగ్జరీ కార్లను మాత్రమే కాకుండా రోడ్ రోలర్లు, క్రేన్లు, బస్సులు, JCB వంటి ఎక్స్‌కవేటర్లను కూడా చాలా సులభంగా నడుపుతుంది. ‘డ్రైవర్ అమ్మ’ వీడియోలను చూసిన తర్వాత, నెటిజన్లు ఆమెను ‘వయస్సు కేవలం ఒక సంఖ్య’ అనే దానికి గొప్ప ఉదాహరణగా అభివర్ణించారు. అదే సమయంలో హృదయపూర్వక ఎమోజీల వర్షం కురిపించారు. ఇక ఇప్పుడు ఫ్లైట్ నడపడమే ఆలస్యం అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. 1978లో డ్రైవింగ్ స్కూల్ తెరవమని ఆమె భర్త ఆమెను ప్రోత్సహించాడట. 2004లో ఆమె భర్త మరణించిన తర్వాత ఇంటిని నడపడానికి ఆమె ఈ పాఠశాల బాధ్యతను చేపట్టింది.
Read Also: Shubman Gill: ఆసియా కప్ ముందు బిగ్ రిలీఫ్.. కోలుకున్న గిల్


