King Cobra found inside locker: ఇటీవల కాలంలో సర్పాల వీడియోలు చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పాముల వీడియోలకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వ్యూస్ కూడా ఉంటున్నాయి. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్న స్నేక్ వీడియోలను నెట్టింట వదులుతున్నారు. అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.
సాధారణంగా సర్పాలు ఉన్న చోట నిధి ఉంటుందంటారు పెద్దలు. అందుకే చాలా మంది అవి ఉన్న చోట తవ్వకాలు జరుపుతారు. అయితే కొన్ని సార్లు పాములు నిధులకు కాపలా కూడా కాయడం మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా దానిని ముట్టుకుంటే కాటు వేయడానికి కూడా వెనుకాడదు. మన పూర్వీకులు, రాజులు బంగారం, వజ్రవైఢ్యూర్యాలకు కాపలాగా పాములను వశీకరణ చేసి కాపలాగా ఉంచేవారట. ఇలాంటి కాన్సెప్ట్ ను ఆధారంగా చేసుకుని మూవీ మేకర్స్ కూడా చాలా సినిమాలే తీశారు.
తాజాగా ఓ నాగుపాము బీరువాలోకి చొరబడి డబ్బులు,బంగారం ఉన్న ప్రదేశంలో కూర్చుంది. ఆ నిధిని ఎవరైనా ముట్టుకుంటే బుసలు కొడుతూ మీదకు వస్తుంది. ఇంట్లో వాళ్లు పలు మార్లు లాకర్ లో చేయి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ అది పడగ ఎత్తి కాటు వేయడానికి ప్రయత్నిస్తోంది. వెంటనే వారు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఇంతలో అక్కడకు చేరుకున్న ఆ వ్యక్తి చాలా సేపు కష్టపడి ఎంతో చాకచక్యంగా దానిని పట్టుకున్నాడు. ఈ మెుత్తం తతంగాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అది కాస్త వైరల్ గా మారింది. బాప్ రే అంటూ నెటిజన్స్ షాక్ అవుతున్నారు. దీనికి ఓ రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి.
వాన కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. అడవుల్లో ఉండాల్సిన నాగులు దగ్గరలో ఉన్న జనవాసాల్లోకి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. అవి ఇంట్లో బెడ్ కిందో, బాత్రూమ్ లోనూ, షూ ల్లోనూ లేదా స్కూటీ డిక్కీలోనూ ఎక్కడ పడితే అక్కడ నక్కి జనాలను ఇబ్బందులకు గురిచేస్తాయి.
Also Read: Lalita Panchami 2025-లలితా పంచమి నేడే.. అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తం ఇదే..


