Lion sitting calmly in front of temple: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో యానిమల్స్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు, పులులు, సింహాలు, ఏనుగులకు సంబంధించిన వీడియోలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. రీసెంట్ గానే దేవీ నవరాత్రులు ముగిశాయి. ఆ సమయంలో జరిగిన ఓ అద్భుత దృశ్యం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అడవికి రారాజు సింహాం. అలాంటి మృగరాజు దేవీనవరాత్రుల సమయంలో అమ్మవారి ఆలయం వద్ద హల్ చల్ చేసిన సంఘటన నెట్టింట ట్రెండ్ అవుతోంది. దివ్యకాంతులతో వెలిగిపోతున్న ఆలయం వద్ద దుర్గాదేవీ వాహనమైన సింహం కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా అది గుడి చుట్టూ తిరుగుతూ ఎవరినీ రానీయకుండా కాపలాగా కూర్చొంది. ఫారెస్ట్ లో ఉండాల్సిన మృగరాజు అమ్మవారి గుడి ముందు ప్రశాంతంగా కూర్చుని ఉండటం చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు స్థానికులు. ఈ వీడియోను IFS అధికారి పర్వీన్ కస్వాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అరుదైన దృశ్యం గుజరాత్ లోని గిర్ అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆలయంలో జరిగింది. ఈ ప్రాంతంలో తిరిగే సింహాలు మనుషులపై దాడి చేసిన సందర్భాలు చాలా తక్కువేనని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు.
Also Read: Snake Video-ఈ ముద్దుగుమ్మ అందానికి పాములు కూడా మైమరిచిపోయాయి.. ఇదిగో వీడియో?
ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఆలయానికి చూసుకోడానికి మంచి భద్రతా సిబ్బంది ఉన్నారు.. ఆందోళన పడాల్సిన పనిలేదు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది చూడటానికి చాలా రియాల్టీగా ఉన్నప్పటికీ, కొందరు మాత్రం ఏఐ వీడియో అని అంటున్నారు. ప్రపంచంలో ఎక్కువగా సింహాల జనాభా ఉన్న దేశం మనది. ముఖ్యంగా మృగరాజులు అధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్. భారత్ లో సింహాల జనాభా 2020లో 674 ఉంటే.. 2025 కల్లా 891కి చేరుకుంది. అంటే 32 శాతానికిపైగా సింహాల సంఖ్య పెరిగింది. వీటిల్లో ఆడ సింహాలు 330 ఉన్నాయి. గిర్ నేషనల్ పార్క్ లో అత్యధికంగా 394 మృగరాజులు ఉన్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 10న జాతీయ సింహాల దినోత్సవం జరుపుకుంటారు.


