Five Headed Snake viral video: మన దేశంలో చాలా మంది పాములకు దైవత్యం ఉందని నమ్ముతారు. ముఖ్యంగా నాగు పాములను పూజిస్తారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో నాగుల చవితి వేడుకను కూడా జరుపుకుంటారు. సినిమాల వల్లో లేదా పురాణాల ప్రభావమో ఏమో కానీ సర్పాలకు శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు.
అప్పట్లో ఆదిశేషుడు, అనంత, వాసుకీ, తక్షక, కర్కోటక వంటి శక్తివంతమైన పాములు ఉండేవని గ్రంథాల్లో ప్రస్తావించారు. భూమండలాన్ని మోసే శేష నాగుకు వెయ్యి పడగలు ఉంటే.. మహాశివుడు మెడలో ఉండే వాసుకీకి వంద పడగలు ఉన్నాయని చెబుతారు. నేటి మానవ సమాజం ఇలాంటి సర్పాలను చూసిందే లేదు. మహా అయితే రెండు తలలు ఉన్న పాములను మాత్రమే చూసి ఉంటారు. అయితే తాజాగా ఐదు తలల ఉన్న నాగుపాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో చుట్టూ పొదలు ఉన్న ఓ మైదాన ప్రాంతంలో ఓ నాగుపాము పడగవిప్పి నిల్చుని ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ పాముకు ఐదు తలలు ఉండటం. ఆ నాగ సర్పం పక్కనే కొన్ని పాము గుడ్లు కూడా ఉన్నాయి. దానిని చూస్తే చాలా భయంకరంగా ఉంది. జన్యుపరమైన లక్షణాల కారణంగా ఇలాంటి పాములు జన్మిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది నిజమైన పాము కాదని.. ఏఐతో క్రియేట్ చేశారని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు బాగా ఎడిట్ చేసి పెట్టారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
ఈ మధ్య కాలంలో సర్పాల వీడియోలు చూసేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా, అనకొండ, కొండ చిలువలకు సంబంధించిన వీడియోలకు ఓ రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా వాటికి సంబంధించిన వీడియోలనే ఎక్కువ సంఖ్యలో నెట్టింట డంప్ చేస్తున్నారు. అందులో కాస్త విచిత్రంగా ఉన్న వీడియో వైరల్ గా మారుతుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏది నిజమో, ఏది అబద్దమో అర్థం కావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందిందని ఆనందం పడాలో లేదా దాని వల్ల అయోమయానికి గురవుతున్నామని బాధపడాలో అర్థం కానీ పరిస్థితి నెలకొంది.
Also Read: Viral Video -ఏంటి బ్రో.. ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. మెుసలితో సవారీనా..!


