Two Headed Python Viral Video: మనలో చాలా మంది పాములకు దైవత్వం ఉందని నమ్ముతారు. అదే విధంగా పండుగల పేరుతో వాటికి పూజలు కూడా చేస్తారు. పురాణాల ప్రభావమో లేదా సినిమాల ప్రభావమో తెలియదు కానీ పాములు గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ జనాల్లో బాగా పెరిగిపోయింది. అందుకే సోషల్ మీడియాలో పాముల వీడియోలకు విపరీతమైన క్రేజ్. నాగుపాములు, పైథాన్ వీడియోలు అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పాముల ధరించే నాగమణి గురించి తరుచూ నెట్టింట తెగ చర్చ జరుగుతూ ఉంటుంది.
పురాణాల్లో చెప్పినట్లు నిజంగా ఈ భూమిని వెయ్యి తలలున్న ఆదిశేషుడనే నాగు మోస్తున్నాడా, సర్పాల రాజైన వాసుకీకి నిజంగా వంద తలలున్నాయా? అయితే ఇవన్నీ కట్టుకథలని కొందరు అంటుంటే.. నిజమని మరికొందరు నమ్ముతున్నారు. వాస్తవంగా పాములకు అన్ని తలలు ఉంటాయా.. అంటే ఎవరికీ ఈ విషయంలో క్లారిటీ లేదు. అయితే ఈ మధ్య కాలంలో రెండు తలల కోబ్రాలను చూశాం. అయితే రెండు తలలు కలిగిన కొండచిలువను ఎప్పుడు చూడలేదు. కానీ తాజాగా అలాంటి ఏ రేర్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్స్ తమదైన రీతిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఈ వీడియోలో ఓ కొండ చిలువ రెండు తలలను కలిగి ఉండటం చూడవచ్చు. ఇది పూర్తిగా పసుపు రంగులో.. ఒట్టి నిండా రకరకాల గుర్తులతో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే ఇలాంటివి సాధారణంగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఈ కొండ చెలువను బాల్ ఫైథాన్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. ఇవి అధికంగా గడ్డి మైదానాలతో పాటు బహిరంగ అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి. ఇవి విషాన్ని కలిగి ఉండవు. ఇవి ఐదు అడుగులు పెరుగుతాయని.. 30 నుంచి 40 సంవత్సరాలు జీవిస్తాయని సమాచారం. అయితే జన్యుపరమైన లోపాల కారణంగానే ఇలా రెండు తలల పాములు జన్మిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also read: Nagamani Rare video – నాగమణికి కాపలా కాస్తున్న అరుదైన శ్వేతనాగు.. వీడియో ఇదిగో!


