Saturday, November 15, 2025
HomeTop StoriesViral Video: ట్రీట్మెంట్ చేస్తున్న లేడీ డాక్టర్‌కి సైట్ కొడుతున్న పిల్లాడు.. ట్రెండింగ్ లో వీడియో..

Viral Video: ట్రీట్మెంట్ చేస్తున్న లేడీ డాక్టర్‌కి సైట్ కొడుతున్న పిల్లాడు.. ట్రెండింగ్ లో వీడియో..

Woman Doctor Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ ఏమూల జరిగినా మన కళ్ల ముందే ప్రత్యక్షమవుతుంది. రోజూ వందల వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఓ చిన్న పిల్లాడు వైద్యం చేస్తున్న లేడీ డాక్టర్ గా సైట్ కొడుతున్నాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

- Advertisement -

ఓ పదేళ్ల పిల్లాడికి కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చేరుతాడు. ఆ కుర్రాడికి వైద్యం చేయడానికి ఓ లేడీ డాక్టర్ వస్తుంది. ఇంజెక్షన్ అంటే పిల్లలు భయపడతారు, కానీ ఆ బాలుడు ఏ మాత్రం భయపడకుండా డాక్టర్ కు సైట్ కొడుతూ .. ఇంజక్షన్ చేయించుకుంటాడు. ఇదే సమయంలో ఆ యువ వైద్యురాలు కూడా కుర్రాడి చూపులకు మైమరచిపోతుంది. అంతేకాకుండా వాడినే చూస్తూ ఉంటుంది. ఆ పిల్లాడు కూడా ఏ మాత్రం కన్ను ఆర్పకుండా ట్రీట్మెంట్ చేస్తున్న ఆమెనే చూస్తుండిపోతాడు. అంతేకాకుండా ఆ డాక్టర్ ఇంజెక్షన్ వేస్తున్నప్పుడు అతడు సిగ్గుపడటం వీడియోలో చూడవచ్చు.

ఈ మెుత్తం యవ్వారాన్ని అక్కడున్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… అది కాస్త వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ వీడియో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను రెండు లక్షల మందికిపైగా వీక్షించగా.. వేలాది మంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై రకరకాల మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. అయితే చిన్నపిల్లాడి చేష్టలు పలు ప్రశ్నలకు దారితీస్తున్నాయి. చదువుకోవాల్సిన విషయంలో ఆ కుర్రాడి ప్రవర్తించిన తీరును కొందరు తప్పుబడుతున్నారు. పిల్లల చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, గురువులది అనేది మరచిపోకండి.

Also Read: Viral Video -రన్నింగ్ ఆటోలో రెచ్చిపోయిన ప్రేమజంట..నడిరోడ్డుపై రొమాన్స్ చేస్తూ..

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad