Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: వీడెవడండీ బాబు.. ఏకంగా కొండ చిలువనే బైక్‌కు కట్టి..!

Viral Video: వీడెవడండీ బాబు.. ఏకంగా కొండ చిలువనే బైక్‌కు కట్టి..!

Chhattisgarh Snake viral video: ఈ మధ్య కాలంలో పాముల వీడియోలకు జనాదరణ బాగా పెరిగింది. నెట్టింట అప్ లోడ్ చేయడం చాలు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా, పైతాన్, అనకొండలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఏకంగా ఓ యువకుడు కొండచిలువను బైక్‌కు కట్టి లాక్కెళ్లుతున్న వీడియో ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. ఒక యువకుడు భారీ కొండచిలువను బైక్‌కు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లడం వీడియోలో చూడవచ్చు. అతడి వెనకాలే కారులో వస్తున్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాజా వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. బలవంతంగా కొండచిలువను రోడ్డుపైకి లాక్కెళ్లడాన్ని తప్పుబడుతున్నారు. నోరులేని మూగజీవాల పట్ల ఇలానేనా ప్రవర్తించేది అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొండచిలువ పట్ల క్రూరంగా వ్యవహారించిన అతడిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫారెస్ట్ అధికారులు వెంటనే కలుగుజేసుకుని ఆ వ్యక్తిని శిక్షించాలని కోరారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులు విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ యువకుడిని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఆ కొండ చిలువను గ్రామం నుండి దూరంగా తీసుకెళ్లి.. ఎవరికీ ఏ హాని కలుగకుండా చేయాలనేదితన ఉద్ధేశమని ఆ యువకుడు పేర్కొన్నాడు. అయినప్పటికీ ఇలా జంతువులను అమానుషంగా లాక్కెళ్లడం చట్టరీత్యా నేరమని అధికారులు తెలిపారు.

వర్షాకాలం వచ్చేసింది. పైగా ఈ కాలంలో పాములు, తేళ్లు వంటివి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సర్పాలు ఇళ్లలో ఎక్కడోక్కడ నక్కి మనల్ని కాటువేసే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోకి పాము దూరితే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వాలి. ఒక వేళ కాటు వేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad