Saturday, November 15, 2025
Homeవైరల్Viral Video: బైక్ పై 40 ఏళ్ల వ్యక్తితో పాతికేళ్ల అమ్మాయి రొమాన్స్.. వైరల్ గా...

Viral Video: బైక్ పై 40 ఏళ్ల వ్యక్తితో పాతికేళ్ల అమ్మాయి రొమాన్స్.. వైరల్ గా వీడియో..

Bike Romance Viral Video: ఈ మధ్య బైక్స్ పై రొమాన్స్ చేయడం ట్రెండ్ అయిపోయింది. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా లవర్స్ రెచ్చిపోతున్నారు. తాజాగా మరోక వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఓ అంకుల్ బైక్ నడుపతూ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు.

- Advertisement -

వీడియోలోకి వెళ్తే.. ఓ ప్రేమ జంట సయ్యారా సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లారు. సినిమా మెుత్తం చూసిన వారికి ఒక సీన్ మాత్రం గుండెల్లో గుచ్చుకుంది. అదే బైక్ రొమాన్స్ సన్నివేశం. ఇందులో హీరోహీరోయిన్స్ బైక్ పై వెళ్తూ ఒకరికొకరు గట్టిగా కౌగిలించుకునే సన్నివేశం ఉంది. ఆ సీన్ ఈ జంటను బాగా ఇన్సిఫైర్ చేసింది. దీంతో మూవీ నుండి బయటకు వచ్చిన ఆ ప్రేమ జంట ఎలాగైనా ఆ మూవీ సీన్ ను రీక్రియేట్ చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో పూణేలోని ఓ రోడ్డుపై బైక్ పై వెళ్తూ రొమాన్స్ చేశారు.

వేగంగా వెళ్తున్న బైక్ పెట్రోల్ ట్యాంక్ పై కూర్చున్న యువతి ఆ అంకుల్ మెడ చుట్టూ చేతులు వేస్తూ రెచ్చిపోయింది. అంతేకాకుండా వయసుల సంబంధం లేకుండా వారు ఒకరినొకరు కౌగిలించుకున్న తీరు అందరినీ షాక్ కు గురిచేసింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు డ్రైవర్ ఆ ప్రేమ జంట చేస్తున్న చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. వీడియోలో ఉన్న వ్యక్తి 40 ఏళ్లు, ఆ అమ్మాయికి ఓ పాతికేళ్లు ఉండొచ్చు. ఈ ఘటన పూణేలోని షిండేవాడి ప్రాంతంలోని ఖేడ్ శివపూర్ హైవేపై జరిగింది. తాజా వీడియోపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా వారు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Viral video-పిచ్చి పీక్స్‌! అమ్మాయిని కౌగిలించుకొని.. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి..

ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలు ఎక్కువై పోయాయి. యువత చేష్టలకు హద్దు అదుపు లేకుండా పోతుంది. రీల్స్ కోసమని కొందరు, తాగిన మైకంలో మరికొందరు, ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో ఇంకొందరు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. పబ్లిక్ ఫ్లేస్ ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని మరచి ఇష్టరీతిన వ్యవహారిస్తున్నారు. ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మిగతా వాళ్లు అలాంటి పనులు చేయడానికి భయపడతారు. పోలీసులు ఇలాంటి విషయాలను చూసి చూడనట్లు వదిలేయకుండా చర్యలు తీసుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad