Ai Viral Videos: ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఏఐ. అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ప్రతిదీ ఈజీగానే అనిపిస్తోంది. దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. కృత్రిమ మేధతో ఎన్నెన్నో ఆవిష్కరణలు చేయవచ్చు. విద్య, ఆరోగ్య, వ్యాపార రంగాల్లో దీని సేవలను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయన్నది కొందరి వాదన. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఈ ఏఐ జీవితంలో భాగంగా చేసుకోవడం తప్పదేమో.
ఇప్పటికే గూగుల్ జెమిని అని, ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ అని, మైక్రోసాఫ్ట్ కో పైలెట్ అనే చాట్ బోట్స్ ను తీసుకొచ్చి కృత్రిమ మేధను ప్రజలకు మరింత చేరువగా చేరుస్తున్నాయి. మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఇవి మెుత్తం సమాచారాన్ని విశ్లేషించి మనకు అర్థమయ్యే రీతిలో జవాబును ఇస్తాయి. అంతేనే ఫోటోలను మనకు నచ్చిన విధంగా రియాలిస్టిక్ గా మారుస్తున్నాయి. గూగుల్ తీసుకొచ్చిన వీయో 3 వీడియో టూల్ అయితే మనకు నచ్చిన ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇలా రోజురోజుకూ ఏఐ సరికొత్త రూపు దాల్చుకుంటుంది.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏఐ సాయంతో చేస్తున్న ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఫన్ కోసం సెలబ్రిటీల ఫోటోలను కూడా వాడేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు, వారి భార్యలతో ఉన్నట్లు చేసిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఇందులో హీరోలను బక్క చిక్కినట్లుగా చూపించి.. భార్యలను మాత్రం బొద్దుగా చూపించారు. చివర్లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఒక్కడినే కొంచెం లావుగా చూపించారు. ఈ లెక్కన పెళ్లి చేసుకుంటే బాలీవుడ్ బడా స్టార్స్ పరిస్థితి కూడా ఇంతేనా అంటూ.. ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మీరు కూడా ఈ ఏఐ ఫన్నీ వీడియోను చూసేయండి.
Also read: Two Headed Python Video – రెండు తలల కొండచిలువ ఎప్పుడైనా చూశారా? వీడియో మీ కోసం..


