Baby Elephant funny Viral Video: సోషల్ మీడియాలో ఈ మధ్య గున్న ఏనుగులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. బుల్లి ఎలిఫెంట్స్ చేసే చేష్టలు ఫన్నీగా ఉండటంతో వీటిని చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఓ చిన్న ఏనుగు చేసిన పని నవ్వులు పూయిస్తుంది. అది చేసిన కొంటె పని ఏంటే తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
వీడియో ఓపెన్ చేస్తే…ఇందులో ఫారెస్ట్ నుంచి ఓ పిల్ల ఏనుగు బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలో దాని కాలిక పొద చుట్టుకుంటుంది. ముందుకు అడుగు వేయకుండా పొద అడ్డుకోవడంతో ఆ గున్న ఏనుగుకు చిర్రెత్తికోస్తోంది. దీంతో బలంగా ఆ పొదను చీల్చుకుంటూ బయటకు వస్తుంది. అంతటితో ఆగకుండా తొండం, కాలుతో ఆ పొదను రోడ్డుపై తొక్కుతూ తన కసినంతటినీ తీర్చుకుంటుంది. ఏనుగు చేసిన హడావిడి చేస్తే మీరు నవ్వకుండా ఉండలేరు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ చేయడమే కాకుండా తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.
ఈ భూమ్మిద పెద్ద జంతువు ఏదైనా ఉందంటే అది ఏనుగునే చెప్పాలి. వీటిలో రెండు రకాల జాతులు ఉన్నాయి. ఒకటి ఆసియా ఏనుగు, రెండోది ఆఫ్రికా ఏనుగు. గజరాజులు శాకాహారి పైగా చాలా తెలివైనవి. పురాణాలు, ఇతిహాసాల్లో కూడా ఏనుగు గురించి ప్రస్తావించారు. ఇంద్రుడు వాహనం ఐరావతమనే తెల్ల ఏనుగు. అందుకే హిందువులు ఏనుగును పూజిస్తారు. ఇవి సాధారణంగా 70 సంవత్సరాలకుపైగా జీవిస్తాయి.
Also Read: Viral Video – గున్న ఏనుగు నీటిని చూసి ఆనందంలో ఏం చేసిందో తెలుసా? వీడియో ఇదిగో..
ఇటీవల కాలంలో జంతువుల వీడియోలకు నెట్టింట తెగ ఆదరణ లభిస్తోంది. పాములు, ఏనుగులు, పులులు, సింహాల వీడియోలకు ఓ రేంజ్ లో లైక్స్ వస్తున్నాయి. యానిమల్స్ వీడియోలు చూసేవారి సంఖ్య పెరగడంతో క్రియేటర్స్ కూడా భారీ సంఖ్యలో అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. అందులో ఏది కాస్త డిఫరెంట్ గా ఉంటే అది వైరల్ ట్రెండ్ అవుతోంది.
Also read: Viral Video-ఇదేం పైత్యం రా బాబు! బెడ్ రూమ్ లో పాములను పెంచుతున్న యువతి.. వైరల్ గా వీడియో..


