Woman Snake Catcher Viral video: ఇటీవల కాలంలో పాముల వీడియోలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా నాగుపాములు, కొండచిలువలు, అనకొండలకు సంబంధించిన కంటెంట్ ను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మానవుడు అడవులు నరికివేయడంతో అక్కడ ఉండాల్సిన సర్పాలు దగ్గరగా ఉన్న జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఇవి ఇళ్లల్లో ఎక్కడ పడితే అక్కడ నక్కి ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. అయితే అన్ని పాములు విషపూరితం కాదు. తాజాగా అలాంటి విషరహిత పాములను ఓ యువతి పట్టుకున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వీడియోను ఓపెన్ చేస్తే.. సాధారణంగా అమ్మాయిలకు పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. అలాంటిది వైరల్ అవుతున్న వీడియోలో ఓ అందమైన యువతి రెండు భారీ సర్పాలను పట్టుకుంటుంది. ఓ గదిలో రెండు పాములను నక్కి ఉన్నాయని సమాచారం అందుకున్న ఓ లేడీ స్నేక్ క్యాచర్ అక్కడకు వచ్చింది. పింక్ కలర్ శారీ ధరించిన ఆ చిన్నది ఏ మాత్రం భయం లేకుండా దాగి ఉన్న సర్పాలను పట్టుకుంది. అంతేకాకుండా ఆ రెండింటిని వేర్వేరు కంటైనర్లలో పెట్టి మూత పెట్టింది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆమె పాములను పట్టుకోవడం చూసి చుట్టుపక్కల వాళ్లు అవాక్కు అయ్యారు. భారీ సర్పాలను పట్టిన తర్వాత కూడా ఆ యువతి ఏమీ జరగనట్టు అక్కడ నుండి వెళ్లిపోయింది. సంఘటనా స్థలంలో ఉన్న ఒకరు ఈ మెుత్తం వీడియోను తీసి సోషల్ మీడియా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఆమె ధైర్యానికి, పాములను పట్టిన విధానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె గ్లామర్ ను చూసి పాములు కూడా మైమరిచిపోయి తనకు లొంగిపోయి ఉంటాయని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.
వర్షాకాలంలో పాములు తమ స్థావరాలను కోల్పోయి ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. అవి ఇళ్లలో కిచెన్ లోనో, బెడ్ రూమ్ లోనో, బాత్రూమ్ లోనో దాక్కుంటున్నాయి. మరికొన్ని సర్పాలు అయితే షూ ల్లోనూ, బైక్స్ యెుక్క డిక్కీల్లోనూ నక్కి మనుషుల ప్రాణాలను సైతం తీస్తున్నాయి. అందుకే పరిసరాలను తరుచూ శుభ్రం చేసుకోవాలి. ఒక వేళ ఏదైనా పాము ఇంటిలోకి వస్తే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి, ఒక వేళ అతడు రావడం లేట్ అయితే మీ చుట్టుపక్కల ఎవరైనా పాములు పట్టుకునే వారు ఉంటే చెప్పండి. ఒక వేళ పాము కాటు వేసిందంటే మీ సొంత వైద్యం మానుకోని దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి యాంటీ వీనమ్ ఇంజెక్షన్ తీసుకోండి. మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది.


