Blue cobra snake viral video: రైతులకు పాములు కనిపించడం సహజమే. వీరికి పొలంలోనూ, గడ్డివాముల్లోనూ, పొదల్లోనూ తరుచూ సర్పాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే కొందరు వీటిని చూసి పారిపోతే.. మరికొందరు భయపడకుండా వాటి దగ్గరకు వెళ్లి రిస్కీ స్టంట్స్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో అరుదైన నీలి రంగు పామును చూడొచ్చు. ఓ రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తుండగా సడన్ గా నీలం రంగు నాగుపాము భూమిలో నుండి బయటకు వస్తుంది. అది బుసలు కొడుతూ ఒక్కసారిగా పైకి లేస్తుంది. అయినా సరే ఆ రైతు ఏమాత్రం భయపడకుండా దానిని తరిమేందుకు ప్రయత్నిస్తాడు. ఆ అరుదైన పాము కాసేపు అక్కడే నిలబడి ఉంటుంది. తర్వాత మెల్లగా చెట్ల వైపు జారుకుని కనిపించకుండా పోయింది. దీనిని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అయింది. ఇది ఏఐ పాము అని కొందరు.. చాలా అందంగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నీలం రంగు పాములు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వాతావరణ మార్పుల వల్ల అవి అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. జన్యుపరమైన మార్పులే ఆ పాము రంగుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి సర్పాలు కనిపించినప్పుడు వాటిని చంపకుండా ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుండటంతో ఇలాంటి పాములు బయటకు రావడం కామన్ అంటున్నారు విశ్లేషకులు.
Also Read: Snake Video -ఫ్రిజ్ ఓపెన్ చేయగానే గుండెలు గుభేల్.. బుసలు కొడుతూ పడగ విప్పి లేచిన నాగుపాము..


