Man bathing venomous king cobra video: ఇటీవల కాలంలో పాముల వీడియోలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా, కొండచిలువ, ఆనకొండలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా నెట్టింట సందడి చేస్తున్నాయి. ఎక్కడ పాము కనిపించిన వెంటనే దానిని ఫోన్ లో తీసి సోషల్ మీడియా అప్ లోడ్ చేస్తున్నారు. అది కాస్త వెరైటీగా ఉంటే ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ వ్యక్తి పాముకు షాంపు పెట్టి మరీ స్నానం చేయిస్తాడు.
వీడియోలోకి వెళ్తే…ఓ వ్యక్తి కింగ్ కోబ్రాను పెంచుకుంటూ ఉంటాడు. తనను ఓ చిన్న పిల్లాడిలా చూసుకుంటాడు. ఈ క్రమంలో అతడు దానికి షాంపూ పెట్టి మరీ స్నానం చేయించాడు. ఆ పాము కూడా అతను ఎలా చెప్తే అలా చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోకు కామెంట్స్, లైక్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. రోజూ అంగన్వాడీకి పంపితే పాలు తాగి వస్తుంది కదా అని ఒకరు కామెంట్ చేస్తే.. ఆ పాముకు బట్టలు వేస్తే ఇంకా బాగుంటుందని మరొకరు కామెంట్ పెట్టారు. కొందరు దానితో జాగ్రత్తగా ఉండంటూ హితవు పలికారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
View this post on Instagram
ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. ఈ సీజన్ లో పాములు ఇంట్లోకి చొరబడటం కామన్. ఈ మధ్య స్నేక్స్ షూస్ లలో, బైక్ డిక్కీలలో నక్కి మనుషులను కాటేసిన ఘటనలు చూశాం. అందుకే మన చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వాన కాలంలో అసలు ఏమాత్రం ఏమరపాటుగా ఉండదు. ఇంట్లో చిన్నపిల్లల వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా పాము కాటు వేస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి, అంతేకానీ సొంత వైద్యం పేరుతో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.
ఇది కూడా చదవండి: King Cobra video: కిచెన్ లో భారీ నల్ల త్రాచు.. సిలిండర్ వెనకాల దాక్కుని దాగుడు మూతలు.. – Telugu Prabha Telugu Daily