Sunday, July 13, 2025
Homeవైరల్Viral: ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. కుప్పకూలిన భారీ వంతెన.. గాల్లో వేలాడిన ట్రక్కు డ్రైవర్..!

Viral: ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. కుప్పకూలిన భారీ వంతెన.. గాల్లో వేలాడిన ట్రక్కు డ్రైవర్..!

China Truck video viral: డ్రాగన్ కంట్రీ చైనాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరుణుడి ధాటికి నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. తాజాగా గుయిజౌ ఫ్రావిన్స్ లోని జియామెన్-చెంగ్డు ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం సంభవించింది. ఒక ట్రక్కు బ్రిడ్జి దాటుతుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వంతెనలోని కొంత భాగం కూలిపోయింది. దీంతో ట్రక్కు ముందు భాగం గాలిలో వేలాడుతూ కనిపించింది. ట్రక్ డ్రైవర్ అందులో ఇరుక్కుపోయాడు. జూన్ 24, మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన అక్కడ ఉన్న కెమెరాలో రికార్డైంది.

- Advertisement -

స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ట్రక్కుపైకప్పుపైకి నిచ్చెన వేసి డ్రైవర్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. నైరుతి చైనాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన్ వీడియో వైరల్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ భయానక దృశ్యంపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడిన ట్రక్ డ్రైవర్ యు గువోచున్ మాట్లాడూతూ.. ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని..అది ఇంకా నా కళ్లముందు మెదిలితుందని అన్నారు.

మరోవైపు, నైరుతి చైనాలో కుండపోత వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఆరుగురు మృత్యువాత పడ్డారు. 80వేల మందికిపైగా నిరాశ్రలయినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. రోంగ్జియాంగ్ వంటి నగరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. భూగర్భ గ్యారేజీలు, షాపింగ్ మాల్ బేస్‌మెంట్‌లు నీటమునిగాయి. రానున్న రోజుల్లో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News