Saturday, November 15, 2025
Homeవైరల్Viral video: ట్రాక్టర్ తో తలపడిన బాహుబలి ఎద్దు.. ఎవరు గెలిచారంటే?

Viral video: ట్రాక్టర్ తో తలపడిన బాహుబలి ఎద్దు.. ఎవరు గెలిచారంటే?

Bull Confronting Tractor on Road: సోషల్ మీడియాలో ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

తరుచూ కుక్కలు, ఆవులు, గేదెలు వంటివి రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ ట్రాఫిక్ జామ్ కు కారణమవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మనుషులపై కూడా దాడికి తెగబడతాయి. ఈ ఘటనల్లో ఒక్కోసారి జనాలు గాయాలపాలవుతారు. తాజాగా ఓ ఎద్దు ట్రాక్టర్‌తో తలపడుతున్న దృశ్యం నెట్టింట వైరల్ గా మారింది. ఓ ట్రాక్టర్ రోడ్డుపై పయనిస్తూ ఉంటుంది. ఇంతలో దానికి ఎదురుగా ఎద్దు వస్తుంది. అతడు దానిని తప్పించడానికి ప్రయత్నిస్తాడు.

కానీ ఆ ఎద్దు పక్కకు తప్పుకోకుండా ఆ ట్రాక్టర్ తో పోట్లాడేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో తన కొమ్మలుతో ట్రాక్టర్ ను గుద్దుతుంది. డ్రైవర్ యాక్సిలరేటర్‌ను నొక్కి బండిని వెనక్కు మళ్లించినప్పటికీ ఆ ఎద్దు దానితో పోరాడుతోంది. దీంతో అతడు కూడా బండిని ముందుకు పోనిచ్చి దానిని గుద్దుతాడు. ఈ సీన్ చూస్తుంటే బాహుబలిలో రానా దున్నతో పోరాడింది గుర్తుకు వస్తుంది.

ఈ మెుత్తం దృశ్యాన్ని అక్కడున్న వారు వీడియో తీసి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంది. ద్దు తాను బాహుబలి అనుకుంటోందని కొందరు.. ఈ ఎద్దు కోపంతో అలా చేసి ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు. ఈ వీడియోను మూడు లక్షల మందికిపైగా వీక్షించారు. 26 సెకన్ల నిడివి మాత్రమే ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇందులో ఎద్దు తగ్గేదే లే అన్నట్లుగా పోరాడటం చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also read: Variety love story -83 ఏళ్ల వృద్ధురాలిని ప్రేమించిన 23 ఏళ్ల యువకుడు.. వీరు ఎలా కలిశారో తెలుసా?

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad