Saturday, November 15, 2025
HomeTop StoriesViral Video: నిమ్మకాయ తిన్న తర్వాత.. ఒంటె రియాక్షన్ చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు..

Viral Video: నిమ్మకాయ తిన్న తర్వాత.. ఒంటె రియాక్షన్ చూస్తే మీరు నవ్వకుండా ఉండలేరు..

Camel funny viral video: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఈ మధ్య జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా ఓ ఒంటె చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

- Advertisement -

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి కర్రకు కాక్టస్ మెుక్కలను అటు ఇటు ఉంచి మధ్యలో నిమ్మకాయను పెడతాడు. దానిని ఒంటె కు చూపిస్తాడు. అది తినడానికి వస్తూ ఉంటుంది. ముందుగా కాక్టస్ మెుక్కను తిన్న కామెల్ ఆ తర్వాత నిమ్మపండు వెంట పడుతుంది. వెంటనే అది నిమ్మకాయను తినడానికి అందుకుంటుంది. నిమ్మకాయను కొరకగానే ఒంటె ఎక్స్‌ప్రెషన్స్ చూడాలి. పుల్లని రుచికి దాని నోటికి తగలగానే నిమ్మకాయను ఊపేసి.. కళ్లు మూసుకొని వింతైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెడుతోంది. ఈ ఫన్నీ రియాక్షన్‌ను చూసి జనాలు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

ఈ వీడియోను @ShouldHaveAnima అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా.. అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. 76 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు రెండు లక్షల మందికిపైగా వీక్షించారు. వేలాది మంది లైక్స్ చేసి..కామెంట్స్ కూడా చేశారు. ఇప్పటి వరకు జంతువులకు సంబంధించిన వీడియోల్లో ఫన్నీ రియాక్షన్ ఇదేనంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే యానిమల్స్ ను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని.. ఇది హింస కిందకు వస్తుందని మండిపడుతున్నారు. ఒక్కసారిగా నోటికి పులుపు తగిలితే ఎలాంటి రియాక్షన్స్ ఇస్తారో.. ఒంటె కూడా అలానే రియాక్ట్ అవ్వడం ఈ వీడియోకు హైలెట్ అనే చెప్పాలి.

Also Read: Viral Video -నీలి రంగు నాలుక ఉన్న వింత జీవిని ఎప్పుడైనా చూశారా?

ఒంటెలు సాధారణంగా ఎడారుల్లో జీవిస్తాయి. మన దేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఒంటెలు ఉన్నాయి. ఇవి 40 నుంచి 50 సంవత్సరాలు జీవిస్తాయి. ఇవి 40 నుండి 65 కి.మీ. వేగంగా పరుగెత్తగలవు.మానవులు మొదటగా ఒంటెల్ని పెంచుకోవడం 2000 BC నుండి ప్రారంభమైంది. ఒంటెలు నీళ్లు తాగకుండా 2 నెలల వరకూ ఉండగలవు. వీటికి నీరు అందితే దాదాపు ఏడు లీటర్ల వరకు ఆగకుండా తాగేస్తాయి. టెంపరేచర్ 41 డిగ్రీలు దాటితే తప్ప ఒంటెలకు చెమట పట్టదు. ఎడారి ప్రాంతాల్లో సరుకుల రవాణాల్లో కామెల్స్ చాలా ముఖ్యమైనవి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad