Cute Baby Elephant Visits School In Kerala: అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోకి జంతువులు రావడం కామన్. తరుచూ రాత్రిపూట క్రూరమృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తుంటాయి. ఒక్కోసారి ఇవి మనుషులపై దాడులకు తెగబడతాయి. అందుకే ఫారెస్ట్ దగ్గరగా ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతూ ఉంటారు. అయితే తాజాగా ఓ గున్న ఏనుగు గుంపు నుంచి తప్పిపోయి ఓ స్కూల్ బిల్డింగ్ దగ్గరకు వచ్చింది. దాన్ని చూడగానే పాఠశాల యాజమాన్యం గది తలుపులను మూసివేసింది. ఈ పాఠశాలలో దాదాపు 115 మంది విద్యార్థుల వరకు ఉంటారు. అయితే ఆ ఏనుగు డోర్ ను తొండంతో కొట్టి కొట్టి విసుగొచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇది మెుత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన కేరళలోని చెకాడి ప్రాంతంలో చోటుచేసుకుంది. చెకాడి గ్రామం కేరళ-కర్ణాటక సరిహద్దులో ఉన్న పుల్పల్లి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. స్కూల్ లో అడ్మిషన్ కోసం వచ్చి ఉంటుందని నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో నెటిజన్స్ కు నవ్వులు తెప్పిస్తుంది.
ఇటీవల కాలంలో యానిమల్స్ వీడియోలకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. ముఖ్యంగా పాములు, ఏనుగులు, పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలను చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. దీంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాంటి వీడియోలనే ఎక్కువగా సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. వీటిలో కాస్త డిఫరెంట్ గా ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
Also Read: Viral video – అద్భుతం.. బంగారు నిధికి కాపలాగా దేవ నాగు.. వీడియో వైరల్..


