Seat Dispute in Metro Train: ఢిల్లీ మెట్రో తరుచూ ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఎప్పుడు రైలు లోపల ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. ఢిల్లీ మెట్రో రైలు నుంచి తాజాగా మరో షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ఇద్దరు మహిళలు సీటు కోసం పొట్టు పొట్టున కొట్టుకున్నారు. ఒకరి జుట్టు ఒకరి పట్టుకుని లాక్కుంటూ గొడవపడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ అందరినీ డిస్టర్బ్ చేశారు.
మెట్రో రైలు తన గమ్య స్థానం చేరుకున్న సరే వారు కొట్టుకోవడం ఆపలేదు. వీరిద్దరినీ విడిపించడానికి ఓ మహిళ ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది. ఆమె ప్రయత్నం విఫలమైంది. వీడియో ముగిసే సమయానికి వారి జుట్టును లాక్కుంటూనే ఉన్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగదారులు ఢిల్లీ వాసులను లక్ష్యంగా చేసుకుని రకరకాల కామెంట్స్ పెడుతున్నరు.
గత జూన్ లో ఇలాంటిదే..
మైట్రో రైళ్లలో సీటు కోసం తరుచూ ప్యాసింజర్స్ గొడవలు పడడం చూస్తూనే ఉంటాం. ఢిల్లీ మెట్రో, ముంబై మెట్రోల్లో ఇలాంటి కొట్లాటలు కామన్. రోజూ సీటు కోసం ఏదోక లొల్లి పెట్టుకుంటూనే ఉంటారు ప్రయాణీకులు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. యూపీలోని ఖేక్రా రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఇందులో సీటు కోసం ఓ వ్యక్తిని 20 మంది వ్యక్తుల బృందం చితకబాదడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also read: Viral -వీధి శునకాలకు ఆహారం పెట్టిందని మహిళపై దాడి.. వైరల్ గా మారిన వీడియో..


