Snake Festival in Bihar’s Navtol: నాగ పంచమి అంటే పుట్టి దగ్గరకు వెళ్లి నాగేంద్రుడిని ఆరాధించడమో లేదా ఇళ్లలోనే నాగదేవత విగ్రహాలను లేదా చిత్రపటాలను పెట్టి పూజ చేయడమో చేస్తుంటాం. కానీ మన దేశంలోని ఓ గ్రామంలో మాత్రం ప్రజలు పాములను మెడలో వేసుకుని ఊరేగుతారు. ఈ వింత ఆచారం 300 ఏళ్లుగా కొనసాగిస్తున్నారట. ఈ సంవత్సరం నాగుల పంచమి జూలై 29న రాబోతుంది. ఈ నేపథ్యంలో బీహార్‌లోని బెగుసరాయ్ జిల్లాలోని మన్సూర్చక్ బ్లాక్‌లో నవ్‌టోల్ గ్రామం వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
బీహార్ రాష్ట్రంలోని నవ్‌టోల్ గ్రామాన్ని పాముల గ్రామం పిలుస్తారు. ఎందుంటే ఇక్కడి ప్రజలు ప్రతి ఏటా నాగ పంచమి నాడు పక్కనే ఉన్న బాలన్ నదిలోకి దూకి.. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పాములను పట్టుకుంటారు. వాటిని మెడలో వవేసుకుని డప్పుల దరువుల మధ్య డ్యాన్స్ చేస్తూ ఊరేగింపుగా భగవతి ఆలయానికి చేరుకుంటారు. మూడు శతాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు నది ఒడ్డుకు చేరుకుంటారు.
View this post on Instagram
దీనికి సంబంధించిన ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన గొప్ప భక్తుల రౌబీ దాస్ భగవతి. ఇతడే తొలుత ఈ ప్రాంతంలో నాగపంచమి నాడు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. అప్పటి నుండి అతని వారసులు, గ్రామస్థులు ఈ ఉత్సావాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈరోజున నవ్‌టోల్ గ్రామం సరికొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ గ్రామానికి చెందిన ప్రజలు దేశంలో ఏ నలుమూలన ఉన్నా.. ఈ పండుగ నాడు నవ్‌టోల్ చేరుకుని నాగపంచమిని ఘనంగా జరుపుకుంటారు.
Also read: Ajmer floods- వీధిలో వరద బీభత్సం.. కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎలా కాపాడారంటే?
ఈ నాగపంచమి పండుగ వెనుక పర్యావరణ ప్రాముఖ్యత కూడా ఉంది. ఈరోజున సర్పాలు ప్రకృతిలోని మీథేన్ వాయువును గ్రహిస్తాయని.. ఇది పర్యావరణ సమతుల్యతకు కారణంగా భావిస్తారు. బెగుసరాయ్‌లో నాగ పంచమి పండుగను మిథిలా పంచాంగం ప్రకారం జరుపుకుంటారు. ఈ నాగ పంచమిని మౌన పంచమి అని కూడా పిలుస్తారు.


