Saturday, July 12, 2025
Homeవైరల్Viral: నల్లత్రాచుతో స్నేహం చేసిన గేదె.. ట్రెండింగ్ లో వీడియో..

Viral: నల్లత్రాచుతో స్నేహం చేసిన గేదె.. ట్రెండింగ్ లో వీడియో..

King Cobra Friendship With Buffalo Video: ఇటీవల కాలంలో నెట్టింట ఎక్కువగా పాముల వీడియోలే దర్శనమిస్తున్నాయి. ఇలాంటి స్నేక్ వీడియోలకు జనాల్లో ఆదరణ పెరగడంతో.. రోజూ కొన్ని వేల వీడియోలు సోషల్ మీడియాలో డంప్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు విచిత్రంగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. పాములు బుసలు కొడుతున్న వీడియోలు, కోపంగా ఉన్న వీడియోలు, ఏదైనా జంతువును మింగే వీడియోలు తరుచూ చూస్తూనే ఉంటాం. కానీ పాములు ఫ్రెండ్ షిప్ చేసే వీడియోలు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోను ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.

- Advertisement -

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ తాచుపాము గేదెతో స్నేహం చేస్తుంది. ఆ పాము మెల్లగా చెట్టు ఎక్కుతుంటే దానిని గేదె తన నాలుకతో నాకుతూ ఉంటుంది. వీరిద్దరి స్నేహాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. వీరిద్దిరి చూడముచ్చటైన ఫ్రెండ్ షిప్ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది.

పాములతో స్నేహమంటే ప్రాణాల మీదకు తెచ్చికున్నట్టే. సాధారణంగా పాములతో మనుషులు ఫ్రెండ్ షిప్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ జంతువులతో స్నేక్స్ మిత్రత్వం చేయడం అరుదు. పైగా కింగ్ కోబ్రాతో స్నేహం అంటే ఆపద కొనితెచ్చుకున్నట్లే. ఈభూమ్మీద భయంకరమైన నాగుల్లో కింగ్ కోబ్రా ఒకటి. ఇది ఒక్క కాటుతోనే ఎంతో విషాన్ని అవతలివారి శరీరంలోకి పంపించగలదు. దీంతో వారు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి కింగ్ కోబ్రాలు ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి భారీ నాగులు కనిపిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి: Python viral video: నక్కను అమాంతం మింగేసిన కొండచిలువ, వీడియో వైరల్ – Telugu Prabha Telugu Daily

వాన కాలం నడుస్తుంది. ఈ కాలంలో పురుగులు, పాములు ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఇవి ఏదో కన్నంలో నక్కి మన ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అవి కాటు వేస్తాయి. పాము కనిపించిన వెంటనే మీరు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి లేదా మీ ఇంటి దగ్గరలో ఎవరైనా పాములు పట్టే వారికి చెప్పండి. పాము కరిచిన వెంటనే సొంత వైద్యం చేయకుండా దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News