Python Swallowing A Fox In Jungle: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పాముల వీడియోలే దర్శనమిస్తాయి. జనాల్లో స్నేక్స్ వీడియోలకు ఆదరణ పెరగడంతో రోజూ వేలల్లో వీడియోలు నెట్టింట అప్ లోడ్ అవుతున్నాయి. ఈ వీడియోల్లో ఏ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉన్న అది వైరల్ గా మారుతుంది. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇందులో ఓ కొండ చిలువ నక్కను మింగేసింది. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది.
వీడియోలోకి వెళ్తే.. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లోని అడవిలో ఒక కొండచిలువ నక్కను అమాంతం మింగేసింది. ఈ ఘటన చూడటానికి ఒళ్లు జలదరించేలా ఉంది. అది నక్కను మింగి నోటితో వదులుతున్నప్పుడు స్థానికులు గమనించి దానిని వీడియో తీశారు. ఆ వీడియో కాస్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోకు వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. నక్కను మింగిందంటే తాము నమ్మలేకపోతున్నామని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
భారతదేశంలో సాధారణంగా కనిపించే పాము జాతుల్లో కొండచిలువ ఒకటి. ఇవి ఎక్కువగా అడవుల్లో సంచరిస్తూ అక్కడ జంతువులను మింగి వాటి ఆకలిని తీర్చుకుంటాయి. ఈ కొం డచిలువలు అప్పుడప్పుడు మనుషులను మింగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది విషరహితమైన పాము. ఇవి ఎక్కువగా ఆఫ్రికా ఖండంలోని సహార ఎడారికి దక్షిణాన ఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో, దక్షిణాసియా ప్రాంతంలోనూ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొండ చిలువ ముదిరితే అనకొండ అవుతుందంటారు. ఇవి ఎంత పెద్ద జంతువునైనా, మనిషినైనా మింగగలవు.
వర్షాకాలం వచ్చేసింది. ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి చుట్టుపక్కల తరుచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే పురుగులు, పాములు ఇళ్లలోకి వచ్చేసే అవకాశం ఉంది. మన ఇంటికి ఏ చిన్న కన్నం ఉన్నా సరే అందులో దూరి ఇంటి లోపలికి వచ్చేస్తాయి. కాబట్టి వానకాలంలో అటువంటి రంధ్రాలను మూసేయండి. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా బెడ్ రూమ్స్, కిచెన్స్, వాష్ రూమ్స్ లో దర్శనమిస్తున్న వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.