Baby cobra viral video: వాన కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వర్షా కాలంలో పాములు ఇళ్లలో నక్కుతాయి. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న అవి మనల్ని కాటు వేయడం పక్కా. అందుకే తరుచూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వంటిగది, బాత్రూమ్, బెడ్ రూమ్ ల్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. ఒక్కోసారి షూ ల్లోనూ, బైక్ ల్లోనూ పాములు దూరుతాయి. ఇలాంటి సమయాల్లో చాలా కేర్ పుల్ గా హ్యాండిల్ చేయాలి. లేకపోతే మన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది.
పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్పాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని విషపూరితమైనవి, మరికొన్ని విషరహితమైనవి ఉంటాయి. పాములు చిన్నవిగా ఉన్న వాటిలో కూడా విషం ఉంటుంది. తాజాగా ఓ బుల్లి కోబ్రా రెండు పెద్ద కోళ్లను బెదిరించే ప్రయత్నం చేసింది. వేలెడంతా లేదు గానీ ఆ రెండింటిని భయబ్రాంతులకు గురి చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియోలోకి వెళ్తే..పాములకు శత్రువులు ఎవరైనా ఉంటారంటే ముంగీసలు, గ్రద్దలు మరియు కోళ్లు అనే చెప్పాలి. తాజాగా ఓ చిన్నపాము బయటకు రావడం గమనించిన రెండు కోళ్లు దాన్ని నోటితో పట్టుకుని దాడి చేయడానికి ప్రయత్నించాయి. అయితే బుల్లి సర్పం ఏ మాత్రం బెదరకుండా ఆ రెండు కోళ్లను ప్రతిఘటించింది. పడగవిప్పి బుసలు కొడుతూ వాటిపై దాడి చేసింది. కాసేపు అలానే చూసిన కోళ్లు ఇక లాభం లేదనుకుని దాన్ని నోటితో పట్టుకుని గోళ్లుతో రక్కి చంపేశాయి. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. నెటిజన్స్ తమదైన శైలిలో లైక్స్, కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Viral Video- పీకల్లోతు వరద నీటిలో ‘బాహుబలి’ సీన్ రిపీట్.. వీడియో ఇదిగో!


