Leopard Vs Crocodile Fight: అడవికి రారాజు సింహం. దీని తర్వాత బలమైన జంతువు ఏదైనా ఉందంటే అది పులి. సాధారణంగా బలహీనమైన జంతువులను క్రూర మృగాలు సులభంగా వేటాడతాయి. అయితే కొన్నిసార్లు బలమైన జంతువులు కూడా ఊహించని దాడులకు బలైపోతాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
ఈ భూమ్మీద వేగంగా పరిగెత్తే వాటిలో చిరుతపులి ఒకటి. దీని స్పీడ్ ను ఏ జంతువు కూడా మ్యాచ్ చేయలేదు. చిరుత ఎలాంటి యానిమల్ నైనా సులభంగా వేటాడుతోంది. తాజాగా ఓ చిరుత నది ఒడ్డున ప్రశాంతంగా నీటిని తాగుతూ ఉంటుంది. అయితే ఆహారం కోసం కాపు కాసిన మెుసలిని అది గమనించలేదు. దీంతో మెుసలి ఒక్కసారిగా నీటిలోంచి ఒడ్డు మీద ఉన్న చిరుతపై మెరుపు వేగంతో దాడి చేసింది. క్షణాల్లో అది జరిగిపోయింది.
మకరం పట్టు నుంచి తప్పించుకోవడానికి చిరుత తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా సరే పట్టు వదలని మెుసలి చిరుతను నీటిలోకి లాకెళ్లుతుంది. కేవలం కొన్ని సెకన్లలోనే అది చిరుతను తన ఆహరంగా మార్చుకుంటోంది. ఈ ఉత్కంఠ రేపే వీడియోను @suaibansari3131 అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఇది తక్కువ టైంలోనే 63వేలకు పైగా వ్యూస్ సాధించింది.ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అందరినీ వేటాడే వేటగాడే చివరకు బలయ్యాడు అంటూ యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Viral video -బాత్రూమ్ కమోడ్ లో భయంకరమైన నల్లత్రాచు.. అక్కడకు వెళ్లిన డాక్టర్ కు ఏం జరిగిందంటే..


