Hundreds of lizards in House: సాధారణంగా చాలా మంది తమ ఇళ్లలో పిల్లులు, కుక్కలు, మేకలు, గొర్రెలు, చిలుకలు కూడా పెంచుకోవడం చూశాం. మరికొంత మంది అయితే పాములను కూడా పెంచుకుంటున్నారు. ఇంకొందరు క్రూర మృగాలైన సింహాలు, పులులను కూడా పెంచుకుంటున్నారు. వీటిని కాస్త ఢిపరెంట్ గా ఓ యువతి బల్లులను పెంచుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి తన ఇంట్లో వందల కొద్ది బల్లుల్ని పెంచుకుంటూ ఉంటుంది. వాటిన్నింటిని ఒక కర్టన్ వెనుక జాగ్రత్తగా దాచి పెడుతుంది. వీడియోలో వందలకొద్దీ బల్లులు కర్టెన్ కింద గోడపై ఉండటం చూడవచ్చు. ఈ వీడియోను ఆమె తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాకుండా లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఎవరైన ఆమె మీద దాడి చేస్తే.. ఈ బల్లుల్ని ఉసిగొల్పుతుందేమో అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా ఇలానే చైనాలో ఓ యువతి బెడ్ రూమ్ లో పాములను పెంచుతున్న వీడియో నెట్టింట చక్కెర్లు కొట్టింది.
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో ఇలాంటి వీడియోలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా పక్షులు, జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలను అధికంగా చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. నెటిజన్స్ అభిరుచి మేరకు కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలాంటి వీడియోలనే ఎక్కువగా నెట్టింట డంప్ చేస్తున్నారు. అందులో ఏది డిఫరెంట్ గా ఉంటే ఆ వీడియో వైరల్ గా మారుతుంది. కొందరు పెంచుకుంటున్నారని కదా అని మీరు కూడా ప్రమాదకరమైన వాటిని తెచ్చుకుంటే అవి మీ ప్రాణాలను తీసే అవకాశం ఉంది. అంతేకాకుండా చట్టపరంగా కూడా మీకు ఇబ్బందులు వస్తాయి.
Also Read: King Cobra- కారు టైర్‌లో నక్కి భయంకరంగా బుసలు కొడుతున్న ఎల్లో స్నేక్.. వైరల్ గా మారిన వీడియో..


