Iberia Airlines Jet Smashed By Bird Strike: మాడ్రిడ్ నుండి పారిస్‌కు వెళ్తున్న విమానం యెుక్క ముక్కు భాగాన్ని ఓ భారీ పక్షి ఢీకొనడంతో క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది. దీంతో ప్యాసింజర్స్ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలోకి వెళ్తే… ఐబీరియా విమానం IB579 మాడ్రిడ్-బరాజాస్ విమానాశ్రయం (MAD) నుండి పారిస్ కు బయలుదేరింది. గాల్లో ఎగిరిన 20 నిమిషాలకే ఫ్లైట్ ను ఓ పెద్ద పక్షీ ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతిని.. క్యాబిన్ మెుత్తం పొగతో నిండిపోయింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికుడు జియాన్‌కార్లో సాండోవల్ ఈ భయానక దృశ్యాన్ని వీడియో తీశాడు.
అతడు మాట్లాడుతూ.. ఫ్లైట్ కుదుపులకు లోనవడం, వింత శబ్దాలు వినిపించడం, క్యాబిన్ మెుత్తం పొగతో నిండిపోవడం కనిపించింది. దీంతో మేము ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాం. నాతోపాటు మిగతా ప్యాసింజర్స్ కూడా భయంతో బిక్కుబిక్కుమంటూ కూర్చొన్నారు. దీనిని గమనించిన విమాన సిబ్బంది ఫ్లైట్ ను వెనక్కి మళ్లించారు. దీంతో విమానం సురక్షితంగా మాడ్రిడ్‌లో ల్యాండ్ అయిన తర్వాత కానీ వారు ఊపిరి పీల్చుకోలేదు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కేవలం పక్షి ఫ్లైట్ ను ఇంతగా దెబ్బతీయడం చాలా మందిని షాక్ కు గురిచేసింది. ‘విమానాలు ఒకప్పుడు స్కైస్క్రాపర్లను కూల్చాయి..కానీ ఇప్పుడు ఒక పక్షి దాడిని కూడా తట్టుకోలేకపోతున్నాయి’ అని మరోకరు కామెంట్ చేశారు.


