YouTuber recreate Tom Cruise scene from ‘Mission Impossible’: హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు. టామ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ రోగ్ నేషన్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఆయన చేసే యాక్షన్ సీన్స్ కు ఫిదా అవ్వని అభిమాని అంటూ ఎవరూ ఉండరు. ఆ మూవీలో యుద్ధ విమానంపై టామ్ చేసిన సీన్ ఇప్పటికీ ఎవరూ మరచిపోరు. తాజాగా అలాంటి సాహసాన్నే రియల్ లైఫ్ లో చేసి చూపించింది ఓ యువతి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతుంది.
భారతీయ అమెరికన్ మిచెల్ ఖరే యూట్యూబ్ లో సాహస వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఈమెకు రిస్క్ స్టంట్స్ చేయడం చాలా ఇష్టం. తాజాగా అలాంటి ప్రమాదకరమైన సాహసాన్నే చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో టామ్ క్రూజ్ సూపర్ హిట్ మూవీల్లో ఒకటైన ‘మిషన్ ఇంపాజిబుల్: రోగ్ నేషన్’లో ఆయన చేసిన ఓ డేంజరస్ స్టంట్ కు ఆమెకు ప్రయత్నించింది. ఈమూవీలో టామ్ క్రూజ్ C-130 సైనిక విమానం టేకాఫ్ అవుతున్నప్పుడు దానికి వేలాడుతూ కనిపిస్తాడు. అదే సీన్ ను ఖరే ఇప్పుడు రీక్రియేట్ చేసి ఇంటర్నెట్ ను షేక్ చేసింది.
అయితే ఈ మూవీలో టామ్ ఎలాంటి సేఫ్టీ తీసుకోడు. కానీ ఇక్కడ ఖరే చిన్న రోప్ సహాయంతో తన స్టంట్ ను పూర్తి చేసింది. దీని కోసం ఆమె ఎంతో కష్టపడి శిక్షణ కూడా తీసుకుంది. ఆమె ప్రొఫెషనల్ స్టంట్ కోచ్‌లతో కలిసి పనిచేసింది. గాలిలో వేలాడుతూ తీవ్రమైన గాలులను ఎలా తట్టుకోవాలో ఆమె నేర్చుకుంది. దీని కోసం వారి టీమ్ 10 నెలలు కష్టపడింది. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
Also Read: Viral Video -తాగిన మత్తులో.. ఏకంగా పెద్దపులి మీద స్వారీ చేశాడు.. ఇదిగో వీడియో..!


