JCB Used For Cooking Dal Makhani: సాధారణంగా జేసీబీ యంత్రాలను నిర్మాణ పనులకే ఉపయోగించడం చూసూంటాం. కానీ వంట చేయడానికి ఎప్పుడైనా జేసీబీని వాడటం చూశారా? తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. కొంత మంది పప్పు వండటానికి ప్రయత్నిస్తారు. దీని కోసం పెద్ద బాణీని తీసుకుని.. అందులో పప్పుచారు చేయడం మెుదలుపెడతారు. ఈ క్రమంలో జేసీబీని గరిటెలాగా వాడి దాల్ ను కలుపుతారు. ఇదంతా చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఆశ్చర్యకరమైన వీడియో చూసి చాలా మంది నోటి మాట రాలేదు. అంతేకాకుండా కొంత మంది ప్రజలు ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. పది లక్షలకు పైగా లైక్‌లను సాధించింది. అంతేకాకుండా వందల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి. పప్పును గ్రీజుతో కలిపితే ఇంకా రుచి పెరిగేదని ఒకరు ఫన్నీగా కామెంట్ చేయగా. నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను అంటూ మరొక యూజర్ రాసుకొచ్చారు. చూడటానికి ఫన్నీగా అనిపించిన ఇది ప్రజల పరిశుభ్రత, ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
Also Read: King Cobra -చీకులు కొనడానికి వచ్చిన భయంకరమైన కింగ్ కోబ్రా.. ఇదిగో వీడియో!
ఈ ఏడాది ప్రారంభంలో జేసీబీకి సంబంధించిన మరో వీడియో వైరల్ అయింది. ఇందులో పెళ్లి కొడుకు జేసీబీలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చాలా మంది వరుడిని కారుల్లో ఊరేగిస్తారు. బాగా డబ్బు ఉంటే హెలికాప్టర్లను వాడుతారు. కానీ దానికి భిన్నంగా వారు బుల్‌డోజర్లు ఉపయోగించారు. దాదాపు డజను బుల్డోజర్లు ఈ వివాహ ఊరేగింపులో చూపించారు. ఈ సంఘటన అప్పట్లో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేసింది.


