Karnataka Railway Clerk Viral Video: రైలు వచ్చే సమయం కావడంతో.. ప్యాసింజర్స్ టికెట్ కోసం లైన్ లో నిల్చనున్నారు. టికెట్లు ఇవ్వాల్సిన క్లర్క్ క్యూను పట్టించుకోకుండా ఫోన్ కాల్‌లో లీనమైపోయాడు. ప్రయాణికులు ఎన్ని సార్లు అడిగినా ఒక నిమిషమని చెప్పి పదిహేను నిమిషాలు వెయిట్ చేయించాడు. దీంతో చిర్రెత్తినా ఓ వ్యక్తి దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ కావడంతో ఆ ఉద్యోగిపై వేటు పడింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని యాదగిరి రైల్వే స్టేషన్‌లో సి.మహేశ్ అనే వ్యక్తి టికెట్ క్లర్క్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఎప్పటిలానే ప్రయాణికులు టికెట్స్ కోసం క్యూలో నిల్చున్నారు. ఇంతలో టికెట్ క్లర్క్ గా ఉన్న మహేష్ కు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో అతడు టికెట్స్ ఇవ్వకుండా ఫోన్ లో లీనమైపోయాడు.
ప్రయాణికులు టికెట్స్ ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా ‘ఒక నిమిషం ఒక నిమిషం’ అంటూ పదిహేను నిమిషాలపాటు వెయిట్ చేయించాడు. దీంతో చిర్రెత్తిన ప్యాసింజర్స్ అతడు ఫోన్ మాట్లాడుతున్న వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి చేరడంతో.. సదరు క్లర్క్ ను రైల్వే ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Also read: Viral video – భారీ కొండచిలువపై స్వారీకి చిన్నారి యత్నం.. షాక్ లో నెటిజన్స్..
సోషల్ మీడియా వేదికగా విమర్శలు
ఆ రైల్వే అధికారి ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడి వ్యవహారించిన తీరు సిగ్గుచేటు అని నెటిజన్స్ అంటున్నారు. అయితే చాలా రైల్వే స్టేషన్లలో అధికారుల పనితీరు ఇలానే ఉందని.. ఎప్పటికప్పుడు వాళ్ల పనితీరు పరిశీలించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. తాజా వివాదంపై రైల్ సేవా సంస్థ స్పందించింది. సదరు ఉద్యోగి అయిన మహేశ్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. ఓ ప్యాసింజర్ ఈ వీడియోను స్టేషన్ మాస్టర్‌కు పంపడంతో గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు వెంటనే మహేష్ పై చర్యలకు ఉపక్రమించారు. నిర్లక్ష్యంగా వ్యవహారించినా అతడిని తొలగించినట్టు స్టేషన్ మేనేజర్ భగీరథ్ మీనా ధ్రువీకరించారు.


