King Cobra Guarding Hidden Gold Treasure: మన పూర్వీకులు వారి సంపాదించిన సొత్తుకు కాపలాగా వశీకరించిన పాములను కాపలాగా పెట్టేవాళ్లని మనం విన్నాం. దీనికి సంబంధించిన సినిమాలు కూడా వచ్చాయి. వీటికి సజీవ సాక్ష్యాలుగా అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని ఏడో గదికి నాగబంధనం ఉండటం, అంతేకాకుండా పూరీ జగన్నాథుడు రత్నభాంఢాగారానికి కూడా సర్పబంధం ఉండటం చెప్పవచ్చు. అందుకే వీటి గదులు తెరవడానికి అధికారులు, ప్రజలు ఇప్పటికీ భయపడుతున్నారు. తాజాగా అలాంటి దృశ్యమే అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
వీడియో ఓపెన్ చేస్తే.. నీటిలో ఓ బంగారు బిందె దర్శనమిస్తోంది. దాని నుండి నగలు, వజ్రవైఢ్యూరాలు ఉంటాయి. అయితే దానికి కాపలాగా నాగసర్పం ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఎవరైనా ఆ ట్రెజరీ దగ్గరకు వస్తే బుసలు కొడుతూ ఎగబడుతోంది. అంతేకాకుండా దానిని ఎవరూ ముట్టుకోకుండా నాగపాము ఆ బిందెను చుట్టుకొని ఉంది. వైరల్ అవుతున్న ఈవీడియోను చూసి అందరూ షాక్ కు గురవుతున్నారు. యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేయబడిన ఈ వీడియోకు వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. అయితే ఇది ఎవరో కావాలనే చేశారని.. వ్యూస్ కోసం ఆ పాము దగ్గర బంగారు బిందెను ఉంచారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కడ చూసిన చిత్రవిచిత్ర వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన కంటెంట్ ను చూసేందుకు జనాలు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే క్రియేటర్స్ కూడా ఢిఫరెంట్ వీడియోలను నెట్టింట అప్ లోడ్ చేస్తున్నారు. అనకొండ, కింగ్ కోబ్రా, కొండచిలువలకు సంబంధించిన వీడియోలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం వానా కాలం నడుస్తుండటంతో ప్రమాదకరమైన పాములు ఇళ్లలోకి వచ్చేస్తాయి. ఇవి ఇంట్లోని ఏదో మూలన నక్కి ఒక్కోసారి మనల్నే కాటు వేస్తాయి. అందుకే మనం ఇంటిని తరుచూ శుభ్రం చేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ఒక వేళ పాము కాటు వేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లండి.
Also read: Anaconda viral video-ఇంత పెద్ద అనకొండను మీరెప్పుడైనా చూశారా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో మీ కోసం..


