King Cobra inside a fridge video: సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రా, అనకొండ, కొండ చిలువలకు సంబంధించిన వీడియోలను చూసేందుకు నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సర్పాల వీడియోలకు వస్తున్న ఆదరణతో కంటెంట్ క్రియేటర్స్ కూడా అధిక సంఖ్యలో పాముల వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇందులో కాస్త డిఫరెంట్ గా ఉన్న వీడియో వైరల్ గా మారుతుంది.
ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పాములు ఏదో విధంగా ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఇవి ఇంటిలో బాత్రూమ్ లోనూ, కిచెన్ లోనూ, బెడ్ రూమ్ లోనూ, బైక్స్ లోనూ, బూట్లలోనూ నక్కి దాక్కుంటున్నాయి. అడవుల్లో ఉండాల్సిన ప్రమాదకరమైన పాములు జనావాసాల్లోకి రావడం వల్ల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ నాగుపాము ఫ్రిడ్జ్ లో దూరి దాక్కుని ఉంది. ఇంట్లో వాళ్లు ఏదో అవసరం ఉండి ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయగా.. అది బుసలు కొడతూ పైకి లేచింది. అది చూడటానికి చాలా పెద్దగా ఉంది. దీంతో భయబ్రాంతులకు గురైన ఆ కుటుంబీకులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. ఈ వీడియోపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. బైట వెదర్ కు తట్టుకోలేక ఫ్రిజ్ లో దూరి ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వర్షాకాలంలో పాములు ఇళ్లలోకి దూరడం కామన్. అందుకే మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎక్కడన్న పాము నక్కిందంటే వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వండి, అది కుదురకపోతే మీ చుట్టుపక్కల పాములు పట్టేవారి ఉంటే వారికి తెలియజేయండి. పొరపాటున ఏదైనా పాము మిమ్మల్ని కాటు వేసిందంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లండి.
Also Read: Viral Video -పాము కుబుసాన్ని లైవ్ లో ఒలవడం ఎప్పుడైనా చూశారా?


