King Cobra turned into Young girl Video: ఈ మధ్య కాలంలో పాముల వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. సర్పాల వీడియోలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నాగు పాము, అనకొండ, కొండ చిలువలకు సంబంధించిన వీడియోలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సోషల్ మీడియాలో పాముల వీడియోలకు వస్తున్న ఆదరణ చూసి కంటెంట్ క్రియేటర్స్ కూడా అదే స్థాయిలో వీడియోలను డంప్ చేస్తున్నారు. అందులో కాస్త ఢిపరెంట్ గా ఉన్న వీడియోలకు వ్యూస్ వస్తున్నాయి. అయితే తాజాగా కింగ్ కోబ్రాకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ప్రమాదకరమైన పాములు ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతాల్లో ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు దగ్గరగా ఉన్న జనావాసాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ ఉంటాయి. అయితే వైరల్ అవుతున్న వీడియోలో..ఓ వ్యక్తి అడవిలో ఉన్న చెరువులో దిగి స్నానం చేస్తూ ఉంటాడు. ఇంతలో ఓ భారీ కింగ్ కోబ్రా ఒడ్డున నిలబడి పడగవిప్పి మరీ అతడిని చూస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి కూడా ఆ పామును గమనించి నీళ్లలో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు.
అయితే ఆ కింగ్ కోబ్రాను చూస్తూ బయటకు వస్తుండగా.. ఆ పాము సడన్ గా నాగినీలా మారిపోతుంది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ తింటాడు. వెంటనే భయంతో పరుగులు తీస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్స్ తమదైన రీతిలో లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఏఐతో చేసిన వీడియో అని కొందరు అంటుంటే..నిజంగా పాము నాగినీలా మారిందా అంటూ ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.
నాగుపాములకు దైవత్వం ఉందని మన పురాణాల్లో చెప్పారు. ఆదిశేషుడు, వాసుకీ, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు వంటి శక్తివంతమైన పాములు గురించి ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో నాగుపాములను దేవతగా ఆరాధిస్తారు. దీనికి సంబంధించి నాగుల చవితి పండుగను కూడా జరుపుతారు. ఉత్తర భారతదేశంలో నాగుల పంచమి చేసుకుంటారు. అంతేకాకుండా నాగుపాము విడిచిపెట్టే నాగమణికి అపారమైన శక్తులు ఉంటాయని.. దానిని ధరించినవారికి తిరుగుండదని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.


