Kolkata Woman Uses Pepper Spray In running Train: ఈ మధ్య కాలంలో బస్సులు, రైళ్లు గొడవలకు, రొమాన్స్ లకు అడ్డాలుగా మారుతున్నాయి. తాజాగా కోల్‌కతా లోకల్ ట్రైన్ లో సీటు కోసం ఓ యువతి ఏకంగా తోటి ప్రయాణీకుల కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియో ఓపెన్ చేస్తే.. ఓ మహిళ సీల్దా దగ్గర లోకల్ రైలు ఎక్కింది. ట్రైన్ అంతా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. ఆకుపచ్చ కుర్తా ధరించిన ఓ మహిళ సీటు కోసం మరో మహిళా ప్రయాణీకురాలితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సదరు మహిళ పెప్పర్ స్ప్రేను బయటకు తీసి ఇతరులపై కొట్టింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించిన్పటికీ ఆమె ఆగకుండా పెప్పర్ స్ప్రేను గాల్లోకి కొట్టింది. దీంతో అక్కడున్న ప్రయాణికులు దగ్గుతూ, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ట్రైన్ లోని కొంత మంది ఆ యువతిని నిలదీసి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు ఆమెను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్యాసింజర్స్ డిమాండ్ చేశారు.
ఈ మెుత్తం ఘటనను అక్కడున్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఆత్మరక్షణ కోసం వాడాల్సిన పెప్పర్ స్ప్రేను ఇతరులకు హాని కలిగించడానికి వాడటం కరెక్ట్ కాదని.. అమ్మాయిల తమ పరిధి దాటిపోయి ప్రవర్తిస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. అమాయక ప్రజలపై దాడి చేయడానికి ఆయుధంగా పెప్పర్ స్ప్రేను దుర్వినియోగం చేయడం దారుణమని కామెంట్స్ చేస్తున్నారు. నేరపూరిత మనస్తత్వం కలిగి ఇలాంటి వారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ నని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది.
Also Read: Swetha nagu-మూడు తలల అరుదైన శ్వేతనాగును ఎప్పుడైనా చూశారా?


