Lovers Romance in running Auto: యువతీ యువకుల చేష్టలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. పబ్లిక్ ప్రదేశాల్లో బరితెగించి ప్రవర్తిస్తున్నారు. నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా నడిరోడ్డుపై కామక్రీడలకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. పసిపాపలు, స్కూల్ పిల్లలు, పెద్దవారు చూస్తున్నారనే కామన్ సెన్స్ లేకుండా రాసలీలలకు దిగుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
హైదరాబాద్‌లో రోడ్లు ఎంత రద్దీగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాంటి రోడ్లపై ఓ ఆటో డ్రైవర్ తన ప్రియురాలిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో నడిపాడు. వారిద్దరూ రన్నింగ్ ఆటోలోనే రొమాన్స్ కు పాల్పడ్డారు. రోడ్డుపై అందరూ చూస్తున్నారనే సోయా కూడా లేకుండా కామకలాపాల్లో మునిగిపోయారు. ఈ మెుత్తం యవ్వారాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఆటోలో వెనుక ప్రయాణికుడు ఉన్న సంగతి మరిచి ఇలాంటి స్టంట్స్ కు పాల్పడటం దారుణమని.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Lovers Romance -కాలేజీలో రెచ్చిపోయిన ప్రేమ జంట.. గాఢంగా హగ్ లు, ముద్దులు ఇచ్చుకుంటూ..
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. యూత్ కామంతో కళ్లుమూసుకుపోయి పబ్లిక్ ప్రదేశాల్లో పాడుపనులకు పాల్పడుతున్నారు. బస్టాండ్స్, బస్సులు, రైళ్లు, మెట్రోలను ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మార్చుకుంటున్నారు. యువత అనే కాదు అంకుల్స్ కూడా బైక్స్ పై రొమాన్స్ కు దిగిన ఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూశాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా యువత చేస్తున్న తప్పుడు పనులను ఆపలేకపోతున్నారు.


