Typhoon Ragasa effect: దక్షిణ చైనా మరియు హాంకాంగ్‌లను రాగసా టైఫూన్ వణికించింది. ఈ టైపూన్ సృష్టించిన విధ్వంసానికి అనేక మంది గాయపడగా.. పలువురు మరణించారు. ఈ భయంకరమైన తుఫాన్ మకావుతో సహా అనేక ప్రాంతాలను చెరువులుగా మార్చేసింది. ఈ క్రమంలో వీధుల్లోకి భారీగా చేపలు కొట్టుకు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్రెండ్ అవుతున్న వీడియోలో.. టైపూన్ ప్రభావం వల్ల మకావు వీధుల్లోకి చేపలు కొట్టుకువచ్చాయి. దీంతో చేపలను పట్టేందుకు స్థానికులు ఎగబడ్డారు. వలలు, ప్లాస్టిక్ సంచులతో చేపలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. చాలా మంది పెద్ద పెద్ద వాటినే పట్టారు. కొంత మంది అయితే పట్టిన చేపలను సైకిళ్లపై లోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనిపించారు. మరికొందరు అయితే చేపలతో సెల్ఫీలకు పోజులిచ్చారు.
ఈ దృశ్యాలను అక్కడున్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. వీధుల్లోకి నీటిని మాత్రమే తీసుకురాలేదు.. విందును కూడా తీసుకొచ్చిందని ఓ యూజర్ చెప్పుకొచ్చాడు. టైఫూన్ రాగస వీధులను పుడ్ స్ట్రీట్ గా మార్చేసిందని మరొకరు కామెంట్ చేశారు.
మకావులోనే కాదు ఇలాంటి ఘటన ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లోని జాంగ్‌జౌ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను షాంఘై డైలీ కూడా పోస్ట్ చేసింది. ఇక్కడ కూడా ప్రజలు చేపలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. రగసా తుఫాను బుధవారం హాంకాంగ్‌ను దాటిన తర్వాత చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌ను తాకింది. ఈ తుఫాను గంటకు 145 కి.మీ వేగంతో గాలులు వీచి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఈ తుపాన్ ధాటికి సుమారు 14 మంది మరణించగా..20 మందికిపైగా గల్లంతయ్యారు.
Also Read: Lovers romance-రన్నింగ్ కారులో ముద్దులు, హాగ్స్ తో రెచ్చిపోయిన లవర్స్.. వీడియో ఇదిగో!


