Saturday, November 15, 2025
HomeTop StoriesViral Video: ఏంటి బ్రో.. ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. మెుసలితో సవారీనా..!

Viral Video: ఏంటి బ్రో.. ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. మెుసలితో సవారీనా..!

Crocodile Bike Ride video viral: ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. రీల్స్ మోజులో పడి.. యువత ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకరమైన స్టంట్ లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి క్రేజ్ పనులకు పాల్పడటం నెట్టింట చర్చకు దారితీస్తుంది. తాజాగా ఓ యువకుడు మెుసలిపై స్వారీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ యువకుడు బైక్ పై వెళ్తుంటాడు. అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. అతడు తన బైక్ సీటుకు భారీ మెుసలిని తాళ్ల కట్టి దానిపై కూర్చుని ప్రయాణిస్తూ ఉంటాడు. అంతటి భారీ సైజున్న మెుసలిని చూసి కూడా ఏమాత్రం భయం, బెరుకు లేకుండా అతడి బైక్ ను నడపడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

దీనిని వీడియోను తీసిని ఓ వ్యక్తి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ లో @Mv__Rebel అనే ఖాతా లో షేర్ చేశాడు. ఇప్పటి వరకు దీనిని వేలాది మంది వీక్షించగా..లక్షల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అది గుర్రం కాదు బ్రో అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఈసారి మెుసలిపై కాకుండా ఏనుగుతో బైక్ నడపడానికి ప్రయత్నించండి వ్యాఖ్యానించారు. అయితే ఇది నిజంగా జరిగిందా లేదా రీల్స్ కోసం చేశారనే విషయంలో క్లారిటీ లేదు. మెుత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Also Read: Lovers Kissing Video – రన్నింగ్ మెట్రోలో లిప్ లాక్ తో రెచ్చిపోయిన ప్రేమ జంట.. వైరల్ గా మారిన వీడియో..

ఇటీవల కాలంలో యానిమల్స్ వీడియోలకు జనాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. నెటిజన్స్ పాములు, సింహాలు, ఏనుగులు మరియు చిరుతలు వంటి జంతువుల వీడియోలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటికి సంబంధించిన వాటికి ఎక్కువ వ్యూస్ వస్తుండటంతో కంటెంట్ క్రియేటర్స్ కూడా భారీ సంఖ్యలో యానిమల్ వీడియోలను సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. ఇందులో కాస్త డిఫరెంట్ గా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంకొన్ని భయపెడుతున్నాయి.

మెుసళ్లు సరీసృపాలు. వాతావరణ మార్పులు కారణంగా ఎన్నో జీవులు నశించినప్పటికీ ఇవి మాత్రం బతికే ఉన్నాయి. దీనికి కారణం మెుసలి యెుక్క శారీరక సౌష్టవమే. ఇది నీటిలో చాలా వేగంగా కదలగలదు, అంతేకాకుండా సులభంగా వేటాడగలదు. వీటి దవడలు చాలా బలంగా ఉంటాయి. దీని నోట్లో పడితే ఎలాంటి జంతువైనా ఆహారం కావాల్సిందే. మనదేశంలోని బితర్కనికా నేషనల్ పార్క్ మెుసళ్లకు ప్రసిద్ధి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad