Saturday, November 15, 2025
Homeవైరల్Maharashtra: లిప్ట్ మూశాడని 12 ఏళ్ల బాలుడిని చావబాదాడు.. వైరల్ గా మారిన వీడియో..

Maharashtra: లిప్ట్ మూశాడని 12 ఏళ్ల బాలుడిని చావబాదాడు.. వైరల్ గా మారిన వీడియో..

Man stabs the kid in lift: మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లో 12 ఏళ్ల బాలుడిపై ఒక వ్యక్తి హింసాత్మకంగా దాడికి పాల్పడ్డాడు. సీసీటీవీలో రికార్డు అయిన ఈ సంఘటనను చూసి నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

అసలేం జరిగిందంటే..
ఓ అపార్ట్ మెంట్లో 9వ అంతస్తులో ఆగిన తర్వాత ఓ 12 ఏళ్ల బాలుడు లిఫ్ట్ తలుపులు మూసివేయడానికి ప్రయత్నించాడు. ఇంతలోకి ఆకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు లిప్ట్ లోపలికి దూసుకొచ్చారు. వారిలో మగాయిన వచ్చి రాగానే బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. మేము వస్తున్నామని తెలిసి కూడా నువ్వు లిప్ట్ మూయడానికి ప్రయత్నించావంటూ ఆ పిల్లవాడిని చెంప మీద విచక్షణారహితంగా కొట్టాడు. ఆ చిన్నారిని కొడుతుంటే పక్కనే ఉన్న లేడీ అలా చూస్తూ ఉండిపోయింది కానీ ఆపే ప్రయత్నం చేయలేదు. ఆ బాలుడిని చావబాదడమే కాకుండా అతని చేతిని కూడా కొరికినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నువ్వు బయటకు వస్తే.. కత్తితో పొడుస్తా అంటూ ఆ కుర్రాడిని బెదిరించాడు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

ఈ అమానుష ఘటన జూలై 4న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంబర్‌నాథ్‌లోని పాలెగావ్‌లో జరిగింది. నిందితుడు కైలాష్ తవానీగా గుర్తించారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాధిత బాలుడు ట్యూషన్ తరగతులకు హాజరు కావడానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా బాలుడిపై తవానీ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా తెలుస్తోంది. దీంతో ఆ కుర్రాడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనపై అంబర్‌నాథ్‌లోని శివాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

అంబర్‌నాథ్‌లోని పాలేగావ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీలోని లిఫ్ట్ లోపల 12 ఏళ్ల మైనర్‌ను దారుణంగా కొట్టిన సంఘటనను డీసీపీ సచిన్ గోర్ ధృవీకరించారు. లిఫ్ట్‌లోని సీసీటీవీని పరిశీలించి తాము నిందితుడిపై కేసు నమోదు చేశామని ఆయన అన్నారు. అయితే అతడిని అరెస్ట్ చేశారా లేదా అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad