Train viral video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్న ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇంకొన్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ మధ్య ట్రైన్స్ లో జరిగే చిత్ర విచిత్ర ఘటనలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. కొంత మంది రైళ్లలో రొమాన్స్ చేస్తుంటే.. మరికొందరు బెడ్ రూమ్స్ గా వాడుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.
దేశంలో రోజూ కొన్ని వేల మంది రైళ్ల ద్వారా ప్రయాణిస్తూ ఉంటారు. పండుగల సమయంలో ట్రైన్స్ చాలా రద్దీగా ఉంటాయి. ఫెస్టివల్స్ కు ఊరెళ్లలాంటే కొన్ని నెలల ముందు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ టికెట్ లేకుండా ఊళ్లకు వెళ్లాలంటే కత్తిమీద సామే. రద్దీ సమయాల్లో కొంతమంది జనరల్ బోగీలో ఎక్కి పడరాని పాట్లు పడుతూ ఉంటారు. మరికొంత మంది బోగీలోని మెట్ల దగ్గర, బాత్రూమ్ వద్ద కూర్చుని ట్రావెల్ చేస్తారు. తాజాగా ఓ వ్యక్తి రైలులో సీట్ లేక ఏకంగా టాయిలెట్‌నే తన బెడ్‌రూమ్‌గా మార్చుకున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ట్రైన్ టాయిలెట్‌లో ఓ వ్యక్తి లగేజీ వేసుకుని పడుకున్నారు. దీంతోపాటు ఆ వ్యక్తి మడతపెట్టిన మంచాన్ని కూడా పట్టుకుని ఉన్నాడు. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ వ్యక్తి దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అన్నయ్య వాష్‌రూమ్‌ను బెడ్‌రూమ్‌గా మార్చేశాడు అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వీడియోకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఆలోచన చాలా డిఫరెంట్ గా ఉందని ఫన్నీ కామెంట్ పెడుతున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rare Snake video -బంగారు వర్ణంలో మెరిసిపోతున్న నాగుపామును ఎప్పుడైనా చూశారా?


