Man drinks beer through nose video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొంత మంది ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవాలని అనుకుంటున్నారు. ఇలా ఫేమస్ అవ్వాలని కొంత మంది రిస్క్ స్టంట్స్ చేసి ప్రాణాలు కూడా పొగోట్టుకుంటున్నారు. మరికొందరు పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మనలో చాలా మంది తప్పతాగి ఇష్టమెుచ్చినట్లు ప్రవర్తిస్తారు. కొంత మంది ఎక్కువగా మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రెవ్ లో దొరికిపోతుంటారు. సాధారణంగా మన మద్యాన్ని నోటితో తాగుతాం. కానీ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ముక్కుతో బీర్ తాగడాన్ని చూడవచ్చు. ఒక గ్లాసు నిండా బీర్ ను తీసుకుని నోటితో కాకుండా ముక్కుతో గట గట తాగేశాడు.
ఇతడి చేష్టలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముక్కుతో అలా ఎలా తాగాడు భయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలా తాగితే ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మెుత్తానికి ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
సోషల్ మీడియాలో రోజూ కొన్ని వేల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని హాస్యాస్పదంగా ఉంటే.. మరికొన్ని షాకింగ్ కు గురిచేస్తున్నాయి. రీల్స్ మోజులో పడి యువత చేస్తున్న చేష్టలు హద్దులు మీరుతున్నాయి. ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఎవరూ చేయని సాహసానికి పూనుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మీలో ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడేటప్పుడు మీ ఫ్యామిలీని గుర్తుకు తెచ్చుకోండి, మళ్లీ జన్మలో వాటి జోలికి వెళ్లరు.
Also Read: Viral Video -‘ట్రైన్ టాయిలెట్‌ను బెడ్ రూమ్ గా మార్చేశాడు’.. వైరల్ గా మారిన వీడియో..


