Pani Puri Making viral video: పానీపూరీ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో శరీరానికి అందించే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. నోటిపూత సమస్య దూరమవుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. దీనిని మితంగా తీసుకుంటేనే ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
స్కూల్ పిల్లల నుంచి పెద్ద వారి దాకా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినేది పానీ పూరి. ముఖ్యంగా మహిళలు దీనిని తెగ ఇష్టపడతారు. రోడ్డు పక్క పానీ పూరి బండి ఉందంటే చాలు వెళ్లి ఎగబడి తింటారు అమ్మాయిలు. అయితే దీనిని తయారు చేసే వారు ఏ మాత్రం పరిశుభ్రత పట్టించుకోకుండా ఇష్టమెుచ్చినట్లు తయార చేసి ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు ఎప్పుడూ పానీ పూరీ జోలికి వెళ్లరు.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి తన ఇంటి బయట మురికి ప్రదేశంలో ఆరుబయట కూర్చుని పానీ పూరీ కోసం పిండిని కలుపుతూ ఉంటాడు. అతడు అండర్ వేర్ వేసుకుని ఈ పని చేస్తూ ఉంటాడు. అతను పిండిని ముద్దుగా చేస్తూ పానీ పూరీ తయారు చేయడానికి సిద్దపడతాడు. ఇదంతా దూరం నుంచి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి వాతావరణంలో చేసే కల్తీ ఆహారమే తినాల్సి వస్తుందని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మన ఇంట్లోనే పానీ పూరీ తయారు చేసుకుంటే ఎటువంటి బాధలు ఉండవని మరొకరు కామెంట్ చేశారు.
Also Read: Viral Video -ప్రియుడితో హోటల్ లో అడ్డంగా దొరికిపోయిన భార్య.. భర్త ఏం చేశాడో తెలుసా?


