Man molested minor girl video: దేశంలో అమ్మాయిలపై వేధింపుల ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు తీరు మాత్రం మారడం లేదు. బస్టాండ్, రైళ్లు, ఆఫీసులు, మెట్రోలు..ఎక్కడపడితే అక్కడ వేధింపులకు గురిచేస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవరినీ వదలడం లేదు. రోజూ పదుల సంఖ్యలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి కూతురు వయసున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ రన్నింగ్ ట్రైన్ లో ఓ తల్లి ఆమె మైనర్ కూతురు ప్రయాణిస్తూ ఉంటారు. అక్కడే ఉన్న ఓ కామాంధుడు వారిపై కన్నేశాడు. ఇంతలో ఆ చిన్నారి పక్కన కూర్చొన్నాడు. అంతేకాకుండా బ్యాగ్ అడ్డుపెట్టుకుని ఆ కూతురు వయసున్న బాలికతో నీచంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారి ప్రైవేట్ పార్ట్ లను టచ్ చేస్తూ, గిల్లుతూ పైశాచీక ఆనందాన్ని పొందాడు. ఆ చిట్టి తల్లికి అది గుడ్ టచ్ లేదా బ్యాడ్ టచ్ కూడా తెలియకపోవడంతో.. ఆ చిన్నారి తల్లికు ఏమీ చెప్పలేకపోయింది.
ఇంతలో అదే రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అతగాడు వంకర బుద్దిని వీడియో తీశాడు. అంతేకాకుండా ఆ నీచుడని నిలదీసేసరికి భయపడిపోయాడు. తొలుత దబాయించినప్పటికీ చివరకు కాళ్ల బేరానికి వచ్చి వీడియో డిలీట్ చేయాలని ప్రాధేయపడ్డాడు. కానీ సదరు వ్యక్తి వీడియోను సోషల్ మీడియా పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ దుర్మార్గుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Viral video -అమ్మాయిలు ఇలా ఉన్నారేంట్రా..! ముసలోడుతో టీనేజ్ గర్ల్ సీక్రెట్‌గా ఏం చేస్తుందో తెలుసా?
ఇటీవల కాలంలో ట్రైన్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. కామాంధులు పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా నలుగురు చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా యువతీ యువకులు చేస్తున్న పాడు పనులు సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నాయి. ట్రైన్స్ బాత్రూమ్స్ ను కూడా ఓయోల్లా వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు సీట్లలోనే ముద్దులు, హాగ్స్ చేసుకుంటూ బరితెగించి ప్రవర్తిస్తున్నారు.


