Man Make tea on electric iron box video: మనలో చాలా మందికి పొద్దున్నే టీ తాగనిదే రోజూ మెుదలవ్వదు. కొంత మందికి రోజూకు మూడు నాలుగు సార్లు టీ తాగుతారు. డైలీ ఒక్క టీ తాగితే మంచిదే కానీ ఎక్కువ సార్లు తాగితే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ప్రేమికులు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కు వెళ్లి టీ, కాఫీలు తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇంట్లో ముసలి వాళ్లు ఉంటే ఉదయం, సాయంత్రం పక్కాగా టీ తాగుతారు. అయితే సడన్ గా ఇంట్లో గ్యాస్ అయిపోతే టీ లవర్స్ అల్లాడిపోతారు. అలాంటి వారి కోసం ఓ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది.
ఈ వైరల్ అవుతున్న వీడియోలో… ఓ ఇంట్లో గ్యాస్ అయిపోతుంది. కట్టెలు పోయి కూడా ఉండదు. దీంతో ఆ వ్యక్తి డిఫరెంట్ గా ఆలోచించాడు. సాధారణంగా మనం బట్టలను ఇస్త్రీ చేయడానికి బొగ్గులతో ఉన్న ఇస్త్రీపెట్టెనో లేదా ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెనో వాడుతాం. కానీ ఈ వ్యక్తి ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెను టీ కాచుకోవడానికి ఉపయోగించాడు. ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెను తలక్రిందులుగా ఉంచి.. ఆ స్టీల్ ఫ్లేట్ పై ఒక చిన్న గిన్నెను ఉంచి అందులో టీ మరగపెట్టాడు. ఈ వీడియోను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లు ఏది చేసైనా టీ తాగాలని అనుకుంటున్నారు అని ఒకరు కామెంట్ చేస్తే.. టీని ఇలా కూడా తయారు చేస్తారా అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇది ఒక పెద్ద ఆవిష్కరణ అని ఓ యూజర్.. హోటల్ లో టీ తయారు చేయడానికి నాకు ఒక మార్గం దొరికిందని ఇంకొరు కామెంట్ చేశారు. మెుత్తానికి ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
Also Read: Viral Video – అంకుల్ మామూలోడు కాదు.. ఏకంగా కింగ్ కోబ్రాకే లిప్ కిస్ ఇచ్చాడు..

