Man on board EasyJet flight threatens bomb blast: ఈజీజెట్ విమానయాన సంస్థకు చెందిన ప్లేన్ లండన్‌లోని ల్యూటన్ ఎయిర్ పోర్టు నుంచి స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో వెళుతోంది. విమానం గాల్లో ఉండగా.. ప్రయాణికుల్లో నుంచి ఓ 41 ఏళ్ల వ్యక్తి లేచి కలకలం సృష్టించాడు. తాను విమానాన్ని బాంబుతో పేల్చివేయబోతున్నాను అంటూ కేకలు వేయడం ప్రారంభించాడు. ఈ సందర్భంగా డెత్ టూ అమెరికా, డెత్ టూ ట్రంప్ అంటూ నినాదాలు చేశాడు. అంతేకాకుండా అల్లా హో అక్బర్ అంటూ పెద్దగా అరిచాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.
అయితే ఇంతలోనే మరో ప్యాసింజర్ అతన్ని నేలపై పడేసి అదమి పట్టుకున్నాడు. అనంతరం విమానం గ్లాస్గోలో దిగగానే పోలీసులు లోపలికి ప్రవేశించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతుంది. అతని వెనక ఎవరైనా ఉన్నారనే విషయమై కౌంటర్ టెర్రరిజమ్ అధికారులు కూడా విచారణ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
ఆ వ్యక్తి కారణంగా పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రోటోకాల్‌లను యాక్టివేట్ చేయాల్సి వచ్చింది. అయితే, విమానంలో ఉన్న వ్యక్తుల భద్రత విషయంలో ఎప్పుడూ రాజీ పడలేదని ఎయిర్‌లైన్ తెలిపింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కాట్‌లాండ్ పర్యటనలో ఉండగానే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈయూతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంలో భాగంగా..ట్రంప్ రెండు రోజుల కిందటే స్కాట్‌లాండ్ వెళ్లారు.
Also Read: Shocking- ఏడాది పిల్లోడు.. ఏకంగా నాగు పామునే కొరికి చంపాడు..


